Jump to content

మయూరి ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
మయూరి ఉపాధ్యాయ
జననం (1979-12-30) 1979 డిసెంబరు 30 (వయసు 45)
ఉడిపి, కర్ణాటక, భారతదేశం
విద్యకాంటెంపరరీ డ్యాన్స్, పర్ఫామింగ్ ఆర్ట్స్
వృత్తిడాన్సర్, కొరియోగ్రాఫర్
నృతరుత్య
జీవిత భాగస్వామిరఘు దీక్షిత్ (2005 - 2019)

మయూరి ఉపాధ్యాయ (జననం 1979 డిసెంబరు 30) భారతీయ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్. ఆమె బెంగుళూరుకు చెందిన నృతరుత్య (Nritarutya) అనే నృత్య సంస్థకు ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుంది. ఆమె తరచూ టీవీ షోలను కూడా నిర్వహిస్తుంది.[1]

2018 జనవరిలో బ్రాడ్‌వే వరల్డ్ ద్వారా ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మయూరి ఉపాధ్యాయ ఎంపికైంది.[2] ఆమె అంతర్జాతీయ కొరియోగ్రఫీ అవార్డు, సియోల్, కొరియోగ్రఫీకి ఉదయ్ శంకర్ అవార్డులు, అనేక ఇతర అవార్డులతో పాటు భారతీయ కళలు, సంస్కృతికి ఆమె చేసిన కృషికి మానవరత్న విజేతగా నిలిచింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

1979 డిసెంబరు 30న మురళీధర్ ఉపాధ్యాయ, శామల ఉపాధ్యాయ దంపతులకు కర్ణాటకలోని ఉడిపి తీరప్రాంత పట్టణంలో మయూరి ఉపాధ్యాయ జన్మించింది. ఇద్దరు తోబుట్టువులలో ఆమె చిన్నది. ఆమె అక్క మాధురి ఉపాధ్యాయ కూడా కొరియోగ్రాఫర్, నృతరుత్య అసోసియేట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తుంది.

శ్రీ వాణి ఎడ్యుకేషన్ సెంటర్ పూర్వ విద్యార్థి అయిన మయూరి ఉపాధ్యాయ MES కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ & సైన్స్ విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

జనాదరణ పొందిన కార్యక్రమాలు

[మార్చు]
  • కలాంక్ (2019) బాలీవుడ్ చిత్రం - ‘ఘర్ మోర్ పర్దేశియా’ పాటకు క్రియేటివ్ కన్సల్టెంట్, కాన్సెప్ట్ డిజైన్
  • షికారా (2020) బాలీవుడ్ చిత్రం - "మర్ జాయే హమ్" పాటకు కాన్సెప్ట్, కొరియోగ్రఫీ
  • రౌనక్ అండ్ జస్సీ (సంగీతం)[3]
  • మొఘల్-ఎ-ఆజం (సంగీతం)[4]
  • డ్యాన్సింగ్ స్టార్స్ సీజన్‌లు 2 & 3 (డ్యాన్స్ రియాలిటీ షో)[5]
  • మాస్టర్ డాన్సర్ (డాన్స్ రియాలిటీ షో)
  • మధుశాల (సంగీతం)[6]
  • మధుర్ మిలన్ (సంగీతం)
  • మేక్ ఇన్ ఇండియా వేడుక (స్టేజ్ క్రియేషన్)
  • ప్రో కబడ్డీ లీగ్ (స్టేజ్ క్రియేషన్)
  • మిర్జియా (బాలీవుడ్)
  • Featured in Teachers Genuine Stories
  • ఫీచర్డ్ ఇన్ టీచర్స్ జెన్యూన్ స్టోరీస్‌ - రాహుల్ బోస్ హోస్ట్ చేసాడు మయూరి ఉపాధ్యాయ ప్రయాణం గురించి ప్రత్యేకమైన సెగ్‌మెంట్‌
  • దేవారిస్ట్స్ సీజన్ 3 ముగింపు (మ్యూజికల్ టీవీ సిరీస్)
  • కళాత్మక ఆవిష్కరణ కోసం టీచింగ్ (డ్యాన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్)
  • ఇషాసెంటర్ (2017)లో మహాశివరాత్రి వేడుకలకు నృత్య దర్శకత్వం
  • పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (PATA) (స్టేజ్)[7]
  • విండ్సర్ కాజిల్‌లో క్వీన్ ఎలిజబెత్ గోల్డెన్ జూబ్లీ వేడుక (ఆసియాకు ప్రాతినిధ్యం)
  • ఇజ్జోడు (2010 కన్నడ చిత్రం) - చిత్రానికి కొరియోగ్రఫీ[8]
  • తమస్సు (2010 కన్నడ చిత్రం) - టైటిల్ సాంగ్ “తమస్సు” కోసం కొరియోగ్రఫీ
  • పంచరంగి (2010 కన్నడ చలనచిత్రం) - “ఉడిసువే” పాటకు కొరియోగ్రఫీ

పురస్కారాలు

[మార్చు]
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా బ్రాడ్‌వే వరల్డ్ అవార్డ్ - మొఘల్-ఎ-ఆజామ్ (2018)
  • 2018లో మైసూర్ రోటరీ మహిళా అచీవర్ అవార్డు - కళలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా, మైసూర్ రాణి గాయత్రి దేవిచే సత్కరించారు.
  • 2013లో కళలు, సాంస్కృతిక రంగంలో చేసిన కృషికి "మానవ్ రత్న" అవార్డు
  • 2012లో కొరియోగ్రఫీ కాన్సెప్ట్ పై అంతర్జాతీయ పోటీ, దక్షిణ కొరియా[9]
  • 2005లో RAPA బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు టెలివిజన్ కమర్షియల్స్, చెన్నై[10]
  • 2004లో యంగ్ ఉమెన్స్ అచీవ్‌మెంట్ అవార్డు
  • ఉదయ్ శంకర్ అవార్డు[11]

మూలాలు

[మార్చు]
  1. "Nritarutya – Contemporary Indian Dance Company". nritarutya.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-04-09.
  2. "Mughal-e-Azam is great theatre". mid-day. 2016-10-09. Retrieved 2018-04-09.
  3. "Raunaq and Jassi - A Playful Mélange of Drama and Music in this Beautifully Presented Hindi Play".
  4. "Reinventing the wheel in art". asianage.com/. 2017-09-14. Retrieved 2018-04-09.
  5. "Mayuri Upadhya to shake a leg on Dancing Star - Times of India". The Times of India. Retrieved 2018-04-14.
  6. "Interview - Mayuri Upadhya: A big milestone for Nritarutya - Lalitha Venkat". narthaki.com. Retrieved 2018-04-14.
  7. "Wizcraft executes the opening ceremony of Pacific Asia Travel Association (PATA) 2015". EVENTFAQS Media (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-04-14.
  8. Mangalore, Mangalore Today. "Mangalore Today | Mangalore, Udupi News and information updated Every hour,Every day". mangaloretoday.com. Archived from the original on 2018-04-15. Retrieved 2018-04-14.
  9. "The vision of a choreographer". Deccan Herald. 16 January 2012. Retrieved 2018-04-14.
  10. R, Shilpa Sebastian (2012-01-12). "Naache Mayuri". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-04-14.
  11. "Report - Attendance Annual Awards 2015". narthaki.com. Retrieved 2018-04-14.