మమతా మీనా
మమతా మీనా | |||
పదవీ కాలం 2013 – 2018 | |||
ముందు | శివనారాయణ మీనా | ||
---|---|---|---|
తరువాత | లక్ష్మణ్ సింగ్ | ||
నియోజకవర్గం | చచౌరా | ||
గుణ జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్
| |||
పదవీ కాలం 2005 మార్చి 25 - 2010 మార్చి 25 | |||
ముందు | మూల్ సింగ్ | ||
తరువాత | కెప్టెన్ సుమేర్ సింగ్ గర్హా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బడోడియా గ్రామం, చచౌరా మండలం, గుణ, మధ్యప్రదేశ్ | 1976 ఏప్రిల్ 4||
జాతీయత | ![]() | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రఘువీర్ సింగ్ మీనా, ఐపీఎస్ | ||
సంతానం | 2 కుమారులు, 2 కుమార్తెలు | ||
నివాసం | మధ్యప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మమతా మీనా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు 2013 శాసనసభ ఎన్నికలలో చచౌరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]మమతా మీనా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు 2004 నుండి 2010 వరకు గుణ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికై 2005 నుండి 2010 వరకు గుణ జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్‌గా పని చేసింది. ఆమె 2005లో బిజెపి మధ్యప్రదేశ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా, 2008 నుండి 2010 వరకు బిజెపి జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా, 2010 నుండి 2014 వరకు బీజేపీ మధ్యప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 2010 నుండి 2014 వరకు గుణ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేసింది.
మమతా మీనా 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చచౌరా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శివనారాయణ్ మీనా చేతిలో 8,022 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చచౌరా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శివనారాయణ్ మీనాపై 34,901 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
మమతా మీనా 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చచౌరా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ చేతిలో 9797 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమెకు 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో భారతీయ జనతా పార్టీని వీడి 2023 సెప్టెంబర్ 21న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి[2][3][4] 2023 ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి 27405 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ NDTV (21 September 2023). "Ex-BJP MLA Mamta Meena Joins AAP In Madhya Pradesh Ahead Of Polls". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
- ↑ ThePrint (21 September 2023). "MP Assembly polls: Former MLA Mamta Meena joins AAP after quitting BJP". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
- ↑ V6 Velugu (21 September 2023). "ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Chachoda Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "Madya Pradesh Assembly Election Results 2023 - Chachoda" (in ఇంగ్లీష్). Election Commission of India. 3 December 2023. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.