మన్‌దీప్ సింగ్ చాతా
స్వరూపం
మన్‌దీప్ సింగ్ చాతా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మన్‌దీప్ చతా మాజీ క్యాబినెట్ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హర్మోహిందర్ సింగ్ కుమారుడు.
రాజకీయ జీవితం
[మార్చు]మన్‌దీప్ సింగ్ చాతా 2014లో పెహోవా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జై భగవాన్ శర్మపై 6,553 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Hindustantimes (25 October 2019). "Harayana assembly election 2019: Of three Olympians, only Sandeep Singh makes it to Haryana assembly". Retrieved 27 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Congress wins Pehowa, Thanesar, Shahabad in Kurukshetra, BJP snatches Ladwa with CM face Saini". Retrieved 26 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Pehowa". Retrieved 27 October 2024.