మన్వేంద్ర సింగ్ (ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్వేంద్ర సింగ్

ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2017 – 2024 జనవరి 6
నియోజకవర్గం దాద్రౌల్

వ్యక్తిగత వివరాలు

మరణం 2024 జనవరి 6
ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్

మన్వేంద్ర సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దాద్రౌల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసారు ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మన్వేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2017లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి 2017లో దాద్రౌల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మన్వేంద్ర సింగ్ 2022 ఎన్నికల్లో దాద్రౌల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పై 9814 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మరణం

[మార్చు]

మన్వేంద్ర సింగ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఐఎల్‌బిఎస్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 2024 జనవరి 6న మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (2022). "Uttarpradesh Assembly Elections 2022 - Dadraul". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  2. The Indian Express (6 January 2024). "BJP MLA Manvendra Singh dies" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  3. The Hindu (6 January 2024). "BJP's Dadraul MLA Manvendra Singh passes away after prolonged liver problem at New Delhi hospital" (in Indian English). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.