Jump to content

మన్యంపులి

వికీపీడియా నుండి
మన్యంపులి
తమిళ సినిమా పోస్టరు
దర్శకత్వంవైశాక్‌
రచనఉదయకృష్ణ
నిర్మాతసింధూర‌పువ్వు కృష్ణారెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంషాజీ కుమార్
కూర్పుజాన్ కుట్టి
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుశ్రీ స‌ర‌స్వ‌తి ఫిలింస్‌
విడుదల తేదీ
2 డిసెంబరు 2016 (2016-12-02)
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్25 కోట్లు[1][2]
బాక్సాఫీసుest.125 crore[3][4]

మన్యంపులి 2016 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం.

పులియూర్ మ‌న్యం ప్రాంతం. అక్కడ పులులు సంచ‌రిస్తుంటాయి. ఓ పులి భారిన ప‌డి వాటి కార‌ణంగా కుమార్ (మోహన్ లాల్) తండ్రిని కోల్పోతాడు. అత‌ని చిన్నప్పుడే త‌ల్లి కూడా చ‌నిపోతుంది. త‌న త‌మ్ముడు మ‌ణిని కూడా అత‌డే పెంచి పెద్ద చేస్తాడు. త‌న తండ్రిని చంపిన పులిని త‌న బావ సాయంతో మ‌ట్టుబెడ‌తాడు. అప్పటి నుంచి పులిని వేటాడ‌టంలో ఆరితేరుతాడు. అనాథ అయిన అమ్మాయి మైనా (కమలిని ముఖర్జీ)ని పెళ్లాడుతాడు. వాళ్ల‌కి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. అనుకోకుండా పాత విరోధం ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్‌)తో కుమార్‌కి గొడ‌వ‌లు మ‌ర‌లా తిర‌గ‌బెడుతాయి. దాంతో ఫారెస్ట్ ఆఫీస‌ర్ నుంచి అత‌నికి ఇబ్బందులు మొద‌ల‌వుతాయి.

స‌రిగా అదే స‌మ‌యంలో మ‌ణి స్నేహితులు ఇద్ద‌రు క‌లిసి కుమార్ కుటుంబాన్ని సిటీకి తీసుకెళ్తారు. అక్క‌డ డాడీ గిరిజ (జగపతి బాబు) ద‌గ్గ‌ర ప‌ని ఇప్పిస్తారు. సెకండాఫ్‌లో డాడీ గిరిజ పులియూర్‌లో కుమార్ కోసం తిరుగుతుంటాడు. కుమార్ ని చంపాల‌ని ప్రయ‌త్నం చేస్తాడు. డాడీ గిరిజ‌కు, కుమార్‌కు అంత వైరం ఎందుకు వ‌చ్చింది? మ‌ణి ప‌రిస్థితి ఏంటి? డాడీ గిరిజ అస‌లు ఎవ‌రు? మ‌ధ్యలో జూలీ (నమిత)కి కుమార్‌తో ఉన్న సంబంధం ఏంటి? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రంగా కథలో సాగుతాయి.

తారాగణం

[మార్చు]
  • మోహ‌న్‌లాల్‌
  • క‌మ‌లినీ ముఖ‌ర్జీ
  • జ‌గ‌ప‌తిబాబు
  • లాల్‌
  • విను మోహ‌న్
  • బాల త‌దితరులు
  • కిషోర్

సాంకేతికవర్గం

[మార్చు]
  • స‌మ‌ర్పణ: తోమిచ‌న్ ముల్క‌పాదమ్‌
  • నిర్మాణ సంస్థ: శ్రీ స‌ర‌స్వ‌తి ఫిలింస్‌
  • క‌థ: ఉద‌య‌కృష్ణ‌
  • సంగీతం: గోపీసుంద‌ర్‌
  • చాయా గ్రహ‌ణం: షాజీ కుమార్‌
  • కూర్పు: జాన్ కుట్టి, షిజాస్ పి.యూన‌స్‌
  • నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి
  • ద‌ర్శక‌త్వం: వైశాక్‌

మూలాలు

[మార్చు]
  1. Parvathi, Rakhi (16 October 2016). "The man who pump primed Murugan into a box office roar". Malayala Manorama. Retrieved 27 October 2016.
  2. "Interview Tomichan Mulakupadam Producer of Pulimurugan Film | Gulf Round Up 15 MAY 2016". Asianet News. 15 May 2016. Retrieved 27 October 2016.
  3. Mathrubhumi Staff (23 November 2016). "Pulimurugan entered 125 Crore Club". Mathrubhumi. Retrieved 24 November 2016.
  4. Asianet web desk (24 November 2016). "Pulimurugan creates new collection record". Asianet News. Archived from the original on 24 నవంబరు 2016. Retrieved 24 November 2016.

బయటి లంకెలు

[మార్చు]