Jump to content

మన్మోహన్ సింగ్ (దర్శకుడు)

వికీపీడియా నుండి
మన్మోహన్ సింగ్
జాతీయత భారతీయుడు
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • సినిమాటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1970–ప్రస్తుతం
వీటికి ప్రసిద్ధిసినిమాటోగ్రఫీ, దర్శకత్వం
గుర్తించదగిన సేవలు
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, జీ అయాన్ ను

మన్మోహన్ సింగ్ భారతదేశానికి చెందిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్. ఆయన పంజాబీ సినిమా దర్శకుడు, బాలీవుడ్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ఆయన యష్ చోప్రా, ఆయన కుమారుడు ఆదిత్య చోప్రా నిర్మించిన చాందిని (1989), లమ్హే (1991), డర్ (1993), దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995),[1] దిల్ తో పాగల్ హై (1997), మొహబ్బతేన్ (2000) సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.[2]

మన్మోహన్ సింగ్ 1994లో తన మొదటి హిందీ సినిమా పెహ్లా పెహ్లా ప్యార్, 2003లో మొదటి పంజాబీ సినిమా జీ అయాన్ ను దర్శకత్వం వహించాడు. ఆయన పిటీసీ పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ 2019 లో "లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు" అందుకున్నాడు.[3]

మన్మోహన్ సింగ్ మొదటి పెద్ద ప్రాజెక్ట్ సన్నీ డియోల్ బేతాబ్ కు తొలి సినిమా ఆ తర్వాత 1990ల ప్రారంభంలో లేకిన్, లమ్హే, చాల్‌బాజ్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆయన యష్ చోప్రా నిర్మించిన డర్, చాందిని సినిమాలకు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. మన్మోహన్ సింగ్ లతా మంగేష్కర్‌తో వారిస్ (1988)లోని "మేరే ప్యార్ కి ఉమర్", లావా (1985) లోని "జీనే దే యే దునియా చాహే మార్ దాలే" , ఆశా భోంస్లేతో కలిసి "మర్నే సే నా యున్ డర్నా", లతతో లైలా (1984) వంటి అనేక బాలీవుడ్ సినిమా పాటల పాడారు.

మన్మోహన్ సింగ్ 2003లో పంజాబీ సినిమా 'జీ అయాన్ ను' దర్శకత్వం వహించి ఆ తరువాత దిల్ అప్నా పంజాబీ , మేరా పిండ్, ముండే యుకె దే వంటి సినిమాలను నిర్మించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
  • నాసిబో (1993)
  • జీ అయాన్ ను (2002)
  • అస ను మాన్ వత్నా దా (2004)
  • యారన్ నాల్ బహరన్ (2005)
  • దిల్ అప్నా పంజాబీ (2006)
  • మిట్టి వజాన్ మార్డి (2007)
  • మేరా పిండ్ (2008)
  • ముండే UK దే (2009)
  • ఇక్ కుడి పంజాబ్ డి (2010)
  • అజ్ దే రంజే (2012)
  • ఆ గయే ముండే UK దే (2014)
  • PR (2022)

నిర్మాతగా

[మార్చు]
  • మేరా పిండ్ (2008)
  • ఇక్ కుడి పంజాబ్ డి (2010)
  • హానర్ కిల్లింగ్ (2014)
  • హేట్ స్టోరీ 2 (2014)

సినిమాటోగ్రాఫర్‌గా

[మార్చు]
  • చన్ పరదేశి (పంజాబీ) (1981)
  • బేతాబ్ (1983)
  • ప్రీతి (పంజాబీ) (1986)
  • ఉచా దర్ బాబే నానక్ దా  (పంజాబీ) (1987)
  • విజయ్ (1988)
  • వారిస్ (1988)
  • సౌతేన్ కి బేటీ (1989)
  • చాందిని (1989)
  • చాల్‌బాజ్ (1989)
  • జీనే దో (1990)
  • లేకిన్... (1990)
  • సనమ్ బేవఫా (1991)
  • లమ్హే (1991)
  • ఇన్సాఫ్ కీ దేవి (1992)
  • యాద్ రాఖేగీ దునియా (1992)
  • అప్రధి (1992)
  • పరంపర (1993)
  • డర్ (1993)
  • నాసిబో (1994)
  • దుష్మణి: ఒక హింసాత్మక ప్రేమ కథ (1995)
  • దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995)
  • మాచిస్ (1996)
  • ఔర్ ప్యార్ హో గయా (1997)
  • దిల్ తో పాగల్ హై (1997)
  • జబ్ ప్యార్ కిసీసే హోతా హై (1998)
  • హు తు తు (1999)
  • మొహబ్బతీన్ (2000)
  • అల్బెలా (2001)
  • ఫిల్హాల్... (2002)
  • కాష్ ఆప్ హమారే హోతే (2003)
  • వో తేరా నామ్ థా (2004)
  • సర్హద్ పార్ (2006)
  • ఇక్ కుడి పంజాబ్ డి (2010)

అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ సినిమాటోగ్రఫీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు :
    • 1990: చాందిని
    • 1994: డార్
  • 1998: ఉత్తమ సినిమాటోగ్రఫీకి జీ సినీ అవార్డు – దిల్ తో పాగల్ హై
  • 2001: ఉత్తమ సినిమాటోగ్రఫీకి సాన్సుయ్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్ – మొహబ్బతీన్

మూలాలు

[మార్చు]
  1. "'Yash Chopra wasn't convinced about DDLJ's climax'". Rediff.com movies. 9 December 2014. Retrieved 3 January 2016.
  2. "Manmohan Singh is a pioneer in Punjab film industry". The Times of India. 14 May 2013. Retrieved 3 January 2016.
  3. Karan Nanda (16 March 2019). "PTC Punjabi Film Awards: Gippy Grewal Bags Best Actor, Sargun Mehta Wins Best Actress". PTC Punjabi. Retrieved 18 March 2019.

బయటి లింకులు

[మార్చు]