మన్నూరు సుగుణమ్మ
స్వరూపం
2015 లో తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో మన్నూరు సుగుణమ్మ శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఈమె భర్త వెంకటరమణ 2014 లో జరిగిన శాసనసభా నియోజకవర్గ ఎన్నికలలో శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికై తిరుపతి శాసనసభ సభ్యుడుగా ఉంటూ అనారోగ్యం కారణంగా మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలలో సుగుణమ్మ ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున నిలచి 1,16,524 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం ఓట్లు 2,94,781 కాగా 1,47,216 ఓట్లు (49.94 శాతం) పోలయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి మేరకు ప్రధాన ప్రతిపక్షమైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో పోటీ పెట్టలేదు.
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - (తిరుపతిలో టీడీపీ గెలుపు - నామమాత్రపు పోటీలో సుగుణమ్మకు భారీ ఆధిక్యత)
- ఈనాడు దినపత్రిక - (తిరుపతిలో తెదేపా భారీ విజయం - 1,16,524 ఓట్ల ఆధిక్యం)