Jump to content

మనశ్శరీరములపై పరిసరముల ప్రభావము

వికీపీడియా నుండి

మనశ్శరీరములపై పరిసరముల ప్రభావము అనే తెలుగు పుస్తకాన్ని పారనంది జగన్నాధ స్వామి రచించారు.

చార్లెస్ రాబర్ట్ డార్విన్ భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు తత్ఫలితంగా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రకృతి లో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానిని - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని వివరించినవాడు చార్లెస్ డార్విన్. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్రకృతి/పరిసరాలు మనస్సుపైనా, శరీరంపైనా చూపే ప్రభావాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరించారు. ఆయన డార్విన్‌తో పాటు ఇతరులు ఏమన్నారో, ప్రాచీన భారతీయ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయో కూడా ఈ గ్రంథంలో రాశారు.

విషయసూచిక

[మార్చు]
  • ఉపోద్ఘాతము
  • పరిసరములు; డార్విన్ యొక్క విచారణ
  • పరిసరములు; వాటి విభజన
  • పరిసరములు; ప్రాణుల సంభవము
  • పరిసరములు; ప్రాణుల సృష్టి
  • పరిసరములు; ప్రాణుల లయము
  • ప్రాణులు సరిపెట్టుకొనుట
  • ఆహారము
  • శీతోష్ణస్థితి; వేడిమి; చవి
  • వెలుతురు; సూర్యరశ్మి
  • నివాస స్థలము
  • ఉపయోగానుపయోగములు
  • మిగిలిన పరిసరములు
  • పరిసరముల సామాన్య ప్రభావము
  • పరిసర ప్రభావ సిద్ధాంతము
  • సిద్ధాంతానుబంధ ప్రశ్నలు
  • సంఘము
  • వరణ సిద్ధాంత నిరూపణ
  • పరిసరములు; మనోవృత్తులు

మూలాలు

[మార్చు]