Jump to content

మద్దుకూరి నారాయణ రావు

వికీపీడియా నుండి
మద్దుకూరి నారాయణ రావు
శ్రీ మద్దుకూరి నారాయణ రావు
జననం1927
వీరన్నపాలెం, పరుచూరు మండలం ప్రకాశం జిల్లా
మరణం2015
క్రియాశీలక సంవత్సరాలుశాసన సభ్యులు : 1972 -1983
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి నాగ రత్తమ్మ
తల్లిదండ్రులునాయుడమ్మ , అచ్చమ్మ
కుటుంబంఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

మద్దుకూరి నారాయణ రావు (1927-2015): గాంధేయ వాది. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో 1972 -1983 వరకు సభ్యుడుగా ఉన్నాడు.[1]

జననం, విద్య

[మార్చు]

మద్దుకూరి నారాయణ రావు గారు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో నాయుడమ్మ.అచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా 1927లో జన్మించాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నారాయణ 8వ తరగతి తో చదువును ఆపి అలహాబాదు వెళ్ళి కొంతకాలం హిందీ భాష నేర్చుకున్నాడు. వీరికి కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ బుచ్చియ్య,అన్నపూర్ణ గార్ల పుత్రిక నాగరత్నమ్మ గారితో1942లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

రాజకీయ జీవితం

[మార్చు]

నారాయణ గారు పిన్న వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసారు. వీరన్న పాలెం గ్రామ సర్పంచ్ గా రెండు సార్లు, బాపట్ల సమితికి ఓకసారి పర్చూరు సమితికి ఓకసారి ప్రసెడెంట్ గా పనిచేసాడు. పది సంవత్సరాలు శాసన సభ సభ్యులుగా పనిచేసాడు.[2] నీటి కరువు లో గ్రామాలకు మంచి నీరు అందించి జల దాతగా పేరు పొందారు. తన స్వగ్రామం వీరన్నపాలెం లో 1961లో విద్యుచ్చక్తి సౌకర్యం కల్పించటంలో . 1964లో ఇంటింటికి మంచినీటి పథకం అమలు చేయటంలో,ఆంద్రా బ్యాంకు శాఖను, హైస్కూలు ఏర్పాటులో ముందుండి మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు.

1962 లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలో పర్చూరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్ది నరహరశెట్టి వెంకట స్వామి పై ఓడిపోయారు.

1972 లో జరిగిన శాసనసభ ఎన్నికలో పర్చూరు నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కకపోవటం వల్ల నారాయణ గారు ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటిచేసి కాంగ్రెస్ అధికార అభ్యర్ది గాదె వెంకట రెడ్డి పై విజయం సాధించాడు.

1978 లోజరిగిన శాసనసభ ఎన్నికలో పర్చూరు నుండి ఇందిరా కాంగ్రెసు అభ్యర్దిగా పోటి చేసి జనతా పార్టీ అభ్యర్ది గాదె వెంకట రెడ్డి పై రెండవ సారి విజయం సాధించాడు.

మరణం

[మార్చు]

క్రియా శీల రాజకీయాల నుండి వైదొలిగి వీరన్నపాలెం లో నిడారంబరంగా శేషజీవితం గడుపుతున్న నారాయణ రావు గారు 2015 మే 4వ తేదిన మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. కొడాలి, శ్రీనివాస్ (2018). వీరన్న పాలెం గ్రామ చరిత్ర. గుంటూరు: కొమల చారిటిబుల్ ట్రస్ట్.
  2. "Parchur (Assembly constituency)".{{cite web}}: CS1 maint: url-status (link)