Jump to content

మణిమంజరి

వికీపీడియా నుండి
మణిమంజరి
సంపాదకులువేటూరి ఆనందమూర్తి
వేటూరి ఆంజనేయులు
వర్గాలుసాహిత్యపత్రిక
తరచుదనంఅర్ధవార్షిక పత్రిక
ముద్రణకర్తశ్రీ ప్రభాకర పరిశోధక మండలి
మొదటి సంచికఆగస్టు 7, 1981 (1981-08-07)
దేశం India
కేంద్రస్థానంహైదరాబాదు
భాషతెలుగు

మణిమంజరి 1981 ఆగష్టు నెలలో ప్రారంభమైన అర్ధ వార్షిక పత్రిక. ఇది తెలుగు, ఇంగ్లీషు భాషలలో వెలువడింది. ఈ వాఙ్మయ యోగ పరిశోధక పత్రికలో వేటూరి ప్రభాకరశాస్త్రి రచనలు, అతని యోగవిద్యకు సంబంధించిన విషయాలు, అతని గురించి అతని శిష్యులు, ఇతర రచయితలు వ్రాసిన వ్యాసాలు మొదలైనవి ప్రచురించారు. శ్రీ ప్రభాకర పరిశోధక మండలి ఈ పత్రికను హైదరాబాదు నుండి ప్రచురించింది. ఈ పత్రికకు వేటూరి ఆనందమూర్తి, వేటూరి ఆంజనేయులు సంపాదకులుగా వ్యవహరించినారు.

విశేషాలు

[మార్చు]

ఈ పత్రిక వేటూరి ప్రభాకర శాస్త్రి జయంతి - వర్ధంతి సందర్భాలను పురస్కరించుకుని ఏడాదికి రెండుసార్లు ఫిబ్రవరిలోను, ఆగష్టు నెలలోను వెలువడింది. ఈ పత్రిక ప్రారంభ సంచికను 1981, ఆగష్టు 7వ తేదీన హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రమంత్రి భాట్టం శ్రీరామమూర్తి ఆవిష్కరించాడు. ఆ కార్యక్రమంలో కె.వి.భాస్కరరావు, దివాకర్ల వెంకటావధాని, పి.ఎస్.ఆర్.అప్పారావు, వాసా ప్రభావతి మొదలైనవారు పాల్గొన్నారు.[1]

ఈ షాణ్మాసిక పత్రికకు తిరుమల రామచంద్ర, తిమ్మావజ్జల కోదండ రామయ్య, వేటూరి సుందరమూర్తి, కొత్త రామకోటయ్య, పోచిరాజు శేషగిరిరావు, వేటూరి గురుప్రసాద్ మొదలైనవారు సంపాదక మండలిలో సభ్యులుగా ఉన్నారు.

రచనలు

[మార్చు]

ఈ పత్రికలో వేటూరి ప్రభాకర శాస్త్రి వివిధ సందర్భాలలో చేసిన రచనలను, డైరీలోని అంశాలను, ప్రసంగాలను, లేఖలను పునర్ముద్రించడమే కాక వేటూరి ప్రభాకర శాస్త్రిపై ఇతరులు చేసిన పరిశోధాత్మక వ్యాసాలను ప్రచురించారు. వేటూరి ఆనందమూర్తి, గొట్టిపాటి బ్రహ్మయ్య, తిమ్మావజ్జల కోదండ రామయ్య, కొత్త రామకోటయ్య, పోచిరాజు శేషగిరిరావు, చల్లా సూర్యనారాయణ, ముదివేడు ప్రభాకరరావు, బులుసు వెంకట రమణయ్య, వేపా రామేశం, రెంటాల వెంకట సుబ్బారావు, దేవులపల్లి అప్పల నృసింహశర్మ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పి.వి.రాజమన్నార్, చాగంటి కల్పవల్లి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, కొర్లపాటి శ్రీరామమూర్తి, వేదము వెంకటరాయశాస్త్రి, తిరుమల రామచంద్ర, వి.వి.యల్.నరసింహారావు, వావిలికొలను వేంకటరమణారావు మొదలైనవారి రచనలు ఈ పత్రికలో చోటు చేసుకున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 August 1981). "వార్తలు - విశేషాలు". మణిమంజరి. 1 (2): 185-186. Retrieved 7 March 2025.

వనరులు

[మార్చు]

ఇంటర్నెట్ ఆర్కైవ్స్‌లో మణిమంజరి ప్రతులు

"https://te.wikipedia.org/w/index.php?title=మణిమంజరి&oldid=4451690" నుండి వెలికితీశారు