Jump to content

మడికి అనంతయ్య

వికీపీడియా నుండి

మడికి అనంతయ్య తెలుగు రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను సా.శ 1374-1400 ప్రాంతాల వాడు. పద్మ పురాణము రచించిన మడికి సింగన తమ్ముడు. ఇతని మీద చాగంటి శేషయ్య పరిశోధనలు చేసాడు. తనకు "అనంతయ్య" అను తమ్ముడున్నట్లు మడికి సింగన తనవాసిష్ఠ రామాయణమున జెప్పి యున్నాడు.[1] అతను భారధ్వాజ గోత్రుడు. అయ్యలమంత్రి పుత్రుడు.[2]

ఈ క్రింది పద్యం వలన మడికి సింగనకు మడికి అనంతయ్య అనే తమ్ముడు ఉన్నట్లు ఆయన విశ్వసిస్తున్నారు;[3]

చం.ఒనరగ నవ్వధూవరు లహోబిళదేవుని గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘుగుణాడ్యు ననంతుని, న్మహీ
జనసుతు నోబయాంకు బుధసన్నుతిపాత్రుని నారయాహ్వయున్
గని నరసింహ నామములు గారవ మారగ బెట్టి రందరన్.

కం.వారలలో నగ్రజుడను
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతినతులవాక్య
శ్రీరచనా సారమతిని సింగాహ్వయుడన్

రచనలు

[మార్చు]

విష్ణు మాయా నాటకాన్ని ఇతనీ రచించి ఉంటాడని చరిత్ర కారులు అభి ప్రాయ పడుతున్నారు. చింతలపూడి యెల్లనకవి రాసినదిగా భావిస్తున్న విష్ణుమాయా నాటకమను ప్రబంధమును ఇతను రాసినట్లు "ఆంధ్ర కవి తరంగిణి"లో విపులముగా వివరింపఁబడింది.[4]

గ్రంథ వివాదం

[మార్చు]

ఈ గ్రంథము రాథామాధవ కవి (ఎల్లయ) రాసినట్లు భావించారు. దానిని అతంతయ్య గ్రంథ చౌర్యం చేసాడనే అపవాదు వచ్చింది. రాధామాధవ కవి కంటే అనంతయ్య నూరు సంవత్సరాల క్రితం జీవించాడు. కనుక రాధామాధవ కవి రచనని అతను చౌర్యం చేయడానికి అవకాశం లేదు. కనుక రాధామాధవ కవి అనంతయ్య గ్రంథమును చౌర్యము చేసినట్లు తెలియుచున్నది. రాధామాధవ, తారక బ్రహ్మ రాజీయము వంటి ఉత్తమ కావ్యములు రచించిన మహాకవి అనంతయ్య గ్రంథమును తాను రాసుకొనునంతటి నీచకార్యము చేసాడని చెప్పలేము. కనుక ఈ కార్యము ప్రతివిలేఖకులదై ఉండునని తలంపవలసి ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మడికి అనంతయ్య - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-26.
  2. "పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/213 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-26.
  3. వాసిష్ట రామాయణం 1-34
  4. నాలుగవ సంపుటము - మడికి - అనంతయ్య చరిత్రము
  5. "పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/214 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-26.