Jump to content

మజ్జిద్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 17°16′15″N 78°43′54″E / 17.270706°N 78.731573°E / 17.270706; 78.731573
వికీపీడియా నుండి

మజీద్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గ్రామం.[1]

మజ్జిద్ పూర్
—  రెవిన్యూ గ్రామం  —
మజ్జిద్ పూర్ is located in తెలంగాణ
మజ్జిద్ పూర్
మజ్జిద్ పూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°16′15″N 78°43′54″E / 17.270706°N 78.731573°E / 17.270706; 78.731573
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం హయాత్‌నగర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,262
 - పురుషుల సంఖ్య 1,146
 - స్త్రీల సంఖ్య 1,116
 - గృహాల సంఖ్య 524
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన హయాత్‌నగర్‌ నుండి 16 కి. మీ., సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 25 కి. మీ., రామోజీ ఫిల్మ్ సిటీకి 6 కి.మీ.దూరంలో ఉంది.ఈ గ్రామ పంచాయితీ పరిధిలో గుంతపల్లి (మాదప్పగూడెం), పీర్లగూడెం రెండు ఉప గ్రామాలు ఉన్నాయి. చాలా వరకు ఇక్కడి ప్రజలు వ్యవసాయంపై ఆదారపడి జీవనం సాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాలలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజలు అటు పట్టణ, ఇటు పల్లెటూరు జీవన విధానాలను అలవర్చుకున్నారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[2]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 524 ఇళ్లతో, 2262 జనాభాతో 1155 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1146, ఆడవారి సంఖ్య 1116. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 266 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 50. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574201[3].పిన్ కోడ్: 501512.

గ్రామ నామం

[మార్చు]

ఈ గ్రామంలో పూర్వ కాలంలో ఎక్కువగా ముస్లిం ప్రార్థనా మందిరాలు (మసీదులు) ఉండటం వల్ల ఈ గ్రామాని అందరు మమ్మయమ్మపురం అనే పేరుతో పిలిచేవారు. అది కాల క్రమేణా కొన్ని ఏళ్ళపాటు పిలవబడి, తరువాత అది మసీదుపురం అని పిలిచేవారు. మసీదుపురం అనే పేరు క్రమ క్రమంగా మజీ్దూపూర్ గా పిలవబడుతూ ఉంది. మమ్మయమ్మపురం పేరు పైన ఏర్పడిన గ్రామం అనడానికి ఈ గ్రామంలో ప్రతి ఏటా మమ్మయమ్మ జాతర జరగటమే. ఈ జాతరను ప్రతి ఏడూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రక్క గ్రామానికి చెందిన యాదగిరిచారి అనే భక్తుడు నిర్వహించి ఈ అమ్మవారిని కొలవడం విశేషం. ఈ గ్రామంలోని వారు ఈ జాతరను పెద్దగా పట్టించుకోరు. కాని ఈ గ్రామానికి చెందిన కుమ్మరి, మంగలి, చాకలి పనివారు మాత్ర ప్రతి ఏడు ఈ జాతరను నిర్వహిస్తు ఉంటారు.

గ్రామ స్వరూపం

[మార్చు]

పూర్వం ఈ గ్రామం రెవెన్యూ భూములు పక్కన ఉన్న అనాజీపూర్ గ్రామానికి కలిసి ఉండటం వల్ల గ్రామం రెండు భాగాలుగాను ఉండేది. అది మజీదూపూర్ లో గల కల్వకింది గూడెం గ్రామంగా పిలువబడేది. అది ఇప్పటికీ రెండవ భాగాన్ని కాల్వకింది గూడెంగానే అభివర్ణించటం జరుగుతుంది. రెవెన్యూ విలేజ్ రెండు భాగాలుగా ఉండటం వల్ల కాల్వకింది గూడెం ప్రజలు వారి ఓటుహక్కును ఇరవై ఏళ్ళ క్రితం అనాజీపూర్ లో వేసేవారు. తరువాత అది క్రమంగా మజీద్‌పూర్ క్రింద గుర్తించి ఇక్కడే వినియోగించేటట్లు అధికారులు చోరవ తీసుకుని మార్చటం జరిగింది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ప్రభుత్వ పాఠశాల వివరాలు:పాఠశాల కోడ్ 28061403802, స్థాపించిన సంవత్సరం :1956.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి అబ్దుల్లాపూర్లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హయాత్‌నగర్‌లోను, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ అబ్దుల్లాపూర్లోను, మేనేజిమెంటు కళాశాల గుంటపల్లిలోనూ లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

205 M మజీద్‌పూర్ నెంబరు గల బస్సు కోఠి నుండి మజీద్‌పూర్, దిల్‍సుఖ్‍నగర్ నుండి మజీద్‌పూర్ (బస్సు రూటు.464 దండుమైలారం) దిల్‌షుక్‌నగర్‌, కోఠి నుండి మజీద్‌పూర్ మీదుగా ఈ బస్సు సౌకర్యం ఉంది.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

భూమి వినియోగం

[మార్చు]

మజీద్‌పూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 668 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 47 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 321 హెక్టార్లు
  • బంజరు భూమి: 77 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 40 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 400 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 38 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మజీద్‌పూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 38 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

జీవనవిధానం

[మార్చు]

ఈ గ్రామానికి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరగా ఉండటం వల్ల గ్రామంలో ఎక్కువగా ఇక్కడ ఉద్యోగం చేస్తు జీవించడం జరుగుతుంది. ఈ గ్రామానికి సమీపంలో ఇంజనీరింగ్ కాలేజీ ఉండటం వల్ల అక్కడ కూడా గ్రామ ప్రజలు ఉద్యోగంలో చేరటం జరిగింది. ఈ గ్రామంలోని యువత ఎక్కడ కాళీగా తిరుగుతున్నట్లు కనిపించరు. వారి స్థాయికి తగిన పనులు వారు చేసుకుంటు కనిపిస్తారు. ఏ అవసరం వచ్చినను గ్రామం నుంచి హైదరాబాద్కు జనం నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఒకానొక కాలంలో మండలంలోనే ఈ గ్రామంలో ఆర్టీసీ కండక్టర్లుగా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండేవారు. కొన్ని ఏళ్ళ క్రిందట ఇక్కడ ప్రధానంగా కల్లు గీత వృత్తియే ప్రధానంగా సాగేది, ప్రచాత్య సాప్రదాయాలు, పట్టణ నగరికతకు అలవాటు పడిన ఇక్కడివారు ఈ గీత వృత్తిని మెల్లమెల్లగా వదులుకుంటున్నారని చెప్పవచ్చు. పాత తరం నాటి వారు ఈ గ్రామంలో ప్రధానంగా గీత వృత్తి సాగించి హైదరాబాదు నగరానికి ఈ కల్లును ఎగుమతి చేస్తు జీవించేవారు. కొన్ని ఏళ్ళ క్రిందట హైదరాబాదు నగరానికి ఎక్కువగా కల్లు ఎగుమతి జరిపిన గ్రామాల్లో ఈ గ్రామం ముందు వరుసలో నిలుస్తుందటే అతిశయోక్తికాదు. క్రమక్రమంగా అనేక కుల వృత్తులకు పని లేకుండా పోతున్నాయి. జీవనవైవిధ్యంలో మార్పులు కనిపించడం జరిగింది.

ప్రత్యకతలు

[మార్చు]

శ్రీ సీతారాముల దేవాలయంను నూతనంగా నిర్మించేందుకు పనులు చేపట్టగా, ఇక్కడ వెంకటేశ్వరస్వామి, హనుమాన్ విగ్రహాలు బయటపడటంతో రాములవారి, వెంటేశ్వరస్వామి, హనుమాన్ ల ఆలయాలను నిర్మించారు.

రాజకీయాలు

[మార్చు]

ఈ గ్రామంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడి ప్రజలు అనేక పోరాటాలు చేయటం జరిగింది, ఈ గ్రామంలో పాత తరంలోగల ఏ వ్యక్తిని తీసుకున్న వారి ఆలోచనావిధానంలో కమ్యూనిస్టు భావాలు ఎక్కవగా ఉంటాయి. పాత తరం వారి నుంచి ఇప్పుడున్న వ్యక్తులు కూడా అక్కడకడ మనకు ఇలాంటి భావాలు కలిగిన యువకులు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడి రాజకీయాలు, వారి అలోచన విధానాలు ప్రచంచంతో పోటిపడుతూ సాగుతూ వారిలో వైవిధ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రామపంచాయితీకి సర్పంచ్ గా ఎన్నికలు జరిగినపుడు సమీప చిన్న గ్రామం అయిన గుంతపల్లిలో గల విశ్వనాథ్ అనే అతను ఎన్నిక కావటం జరిగింది. తరువాతి క్రమంలో వచ్చినవారు మేడిపల్లి నర్సింహ, ఆ తరువాత కసరగోని లక్ష్మయ్య, తరువాత క్రమంలో వచ్చిన వారు కసరగోని లక్ష్మయ్య భార్య అయినటువంటి కసరగోని ధానమ్మ, తరువాత బోడ్డు యాదిరెడ్డి, తరువాత కరిమేల వెంకటేశ్‌ గారి శ్రీమతి. 2006లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో ఈ గ్రామంలో ముగ్గురు పోటి పడటం జరిగింగి అందులో అంతటి శ్రీశైలం గౌడ్ కు- 447 ఓట్లు, కకర్ల జంగయ్యకు-575, కసరగోని లక్ష్మయ్యకు-658 ఓట్లు వచ్చాయి. 2013లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఎసీ-మహిళ మొదటి సారిగా రిజర్వేషన్ వచ్చింది. ఇందులో ప్రదానంగా కాంగ్రెస్ అభ్యర్థి కరిమెల్ల వెంకటేశ్ భార్య గెలుపోందింది. ప్రస్తుతం పోచంపల్లి సుధాకర్‌ రెడ్డి పదవిలో కొనసాగుతున్నారు.

గ్రామ సమస్యలు

[మార్చు]

1).ఈ గ్రామం రాజకీయంగా చాలా బాగా ఎదిగింది కానీ కనీస సమస్యలను కూడా తీర్చుకొలేని దుర్థితికి దిగజారిందని చెప్పాలి. ఏందుకంటే ఇక్కడ చనిపోయిన తరువాత బొంద్ద పెడుదామన్నా భూమీ కెటాయించు కొలేని నాయకులు. నిర్లకక్ష్యం మెండుగా ఉన్న అధికారులు. ఈ రెండు కారణాలవల్ల కనీసం శ్మశానవాటికా కూడా లేదు ఈ గ్రామానికి.

2)ఈ గ్రామం ఉత్తరాలు పంచే తపాలా వ్యవస్థకు నోచుకొలేదు. ఉత్తరం ఎప్పుడు సమయానికి వచ్చిన సందర్భం లేదు. పక్క గ్రామం అయినటువంటి బాటసింగారం పోస్టుమ్యాన్ పైనే ఏళ్ళ తరబడి ఎదురుచుస్తున్నారే కానీ, గ్రామంలో పోస్టుఆఫీస్ కొరకు కృషి చేసిన నాయకులు లేరు. ఉత్తరం సకాలంలో అందకా అన్ని అర్హతలున్నా నిరుద్యోగులు ఉద్యోగం కొల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

గ్రామ రెవెన్యు పరిధిలోని సీలింగ్ ల్యాండ్ వివరాలు

[మార్చు]
  • సర్వే నెంబరు: 34లో 13-00 గుంటలు
  • సర్వే నెంబరు: 35లో 6-31 గుంటలు
  • సర్వే నెంబరు: 111లో 15-20 గుంటలు
  • సర్వే నెంబరు: 111/Aలో 2-10 గుంటలు
  • సర్వే నెంబరు: 112లో 23-15 గుంటలు
  • సర్వే నెంబరు: 128/Pలో 3-11 గుంటలు
  • సర్వే నెంబరు: 129లో 16-10 గుంటలు

గ్రామానికి గుర్తింపు గల ప్రదేశాలు

[మార్చు]
  • అవంతీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఇక్కడే ఉంది.
  • నీలకంఠ విద్యాపీఠ్ ఇంటర్ నేషనల్ స్కూల్ ఇక్కడ ఉంది.[4]

ముఖ్య సంఘటనలు

[మార్చు]

12-10-1986 నాడు మజీదూపూర్ గ్రామంలో కొట్లాటకు దిగిన రెండు వర్గాలాలను చదరగొట్టేందుకు వెళ్ళిన పోలీసులపై ఓ వర్గంవారు రాళ్ళవర్షం కురిపించడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో హయత్ నగర్ అసిస్టట్ సబ్ ఇన్స్ పెక్టర్ తో పాటు నలుగురు పోలీసులకు గాయలయ్యాయి. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ మహమ్మద్ యూసఫ్ పరిస్థితి అందోళనకరా మారింది. ఈ పోలీసు కాల్పులో బాలరాజ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ మేడిపల్లి నరసింహ, ఓ.పి.డి.ఆర్ కు చెందిన కసగోని లక్ష్మయ్యలు కొంతకాలంగా గ్రామ పెత్తనం కోసం తగాధా వల్ల ఈ ఘర్షణ ఏర్పడిందని పోలీసు ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. దసరా పండగ సందర్భంగా పనెండప తేదిన జరిగిన కొట్లాటను పరిష్కరించడానికి వెళ్ళిన పోలీసులపై దాడి జరగడంతో ఈ సంఘటన ఏర్పడింది.

అవార్డులు

[మార్చు]

ఈ గ్రామం 2021-2022 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం నుండి నీరు సమృద్ధిగా ఉన్న గ్రామాలు విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకుంది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-03-31.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-29. Retrieved 2018-03-31.
  5. "రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీలివే". EENADU. 2023-03-31. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-05.
  6. telugu, NT News (2023-03-30). "Telangana | 47 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. 31న‌ హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-05.

వెలుపలి లింకులు

[మార్చు]