మంద కృష్ణ మాదిగ
మంద కృష్ణ మాదిగ | |
---|---|
![]() ప్రసంగిస్తున్న మందకృష్ణ మాదిగ | |
జననం | 1965 (age 59–60) |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సామాజిక కార్యకర్త, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపకులు |
రాజకీయ పార్టీ | మహాజన సోషలిస్ట్ పార్టీ |
మంద కృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు.వరంగల్ జిల్లా హంటర్‌రోడ్డు శాయంపేటలో జన్మించారు.
14 మంది యువకులతో ప్రారంభమైన దండోరా.. ఒక చిన్న గ్రామం ఈదుమూడి , ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం.అర్.పి.ఎస్) కృషి చేసింది. ఆంధ్ర ప్రదేశ్లో ఎస్సి రిజర్వేషన్స్ అన్ని కూడా పెద్ద మొత్తంలో ఒక సామాజిక వర్గం అనుభావిస్తుందని మిగతా సామాజిక వర్గాలైన మాదిగ మాదిగ ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సామజిక అంశాలలో స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 50 ఏండ్ల అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగ కులం చెప్తూ మాకు కూడా అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు కావాలంటూ నినదిస్తూ ముందుకు రావడం జరిగింది.
మంద కృష్ణ మాదిగ 2025 సంవత్సరానికిగాను కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును ప్రకటించింది[1]
'మాదిగ దండోరా ' మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం.ఆర్.పి.ఎస్) మాదిగ, మాదిగ అనుబంధ కులాలు తేది 1994 జూలై 7 న ఈదుమూడి గ్రామం,, ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో 20 మంది యువకులతో ఏర్పడిన) ఎస్సి రిజర్వేషన్స్ ఎస్సి కులాల జనాభా నిస్పతి ప్రకారం విభజించి, దళితుల్లో అత్యదికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చెయ్యాలనే డిమాండ్ తో దండోరా ఉద్యమం, ( మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి-యం, అర్, పి, ఎస్) మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకు వచ్చింది. అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణి విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతికాలం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమం సంస్థగా ఎదిగి, అణగారిన కులాల గొంతుకగా నిలిచింది. ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిల్చింది. ఉదాహరణకు రాష్ట్రంలో వచ్చిన దోలుదెబ్బ, నంగరబెరి, చాకిరేవు దెబ్బ, తుడుందెబ్బ మొదలైన దళిత బహుజన కులాల ఆత్మ గౌరవం, హక్కుల పోరాటాలు దండోరా స్ఫూర్తితో వచ్చాయి. దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు, పోరాట రూపాలు, విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహనా పరిదిని తాత్వికంగా విస్తృత పరిచింది. ప్రభుత్వాలను సైతం దిగివచ్చేవిదంగా నిర్మాణమైన దండోరా ఉద్యమం ఇతర రాష్ట్రాలలో వచ్చిన మాంగ్ (మహారాష్ట్ర), అరుందతియ (తమిళనాడు) మాదిగల (కర్ణాటక) ఎస్సి వర్గీకరణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించింది. మొత్తం పైన దేశంలో సరికొత్త చర్చను పెట్టి కులనిర్ములన, ఫులే-అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యదికంగా వెనుకబడిన ఎస్సి కులాల అనుభవం, హక్కులు, వాటాల పునాదిగా నిర్మాణం కావాల్సిన అవసరాన్ని నొక్కిచేప్పింది.
ఆంధ్ర ప్రదేశ్ దళితులలో జనాభా పరంగా 70 శాతం ఉన్న మాదిగ, మాదిగ ఉపకులలకు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అందితే, 30 శాతం ఉన్న మాల లకు మిగతా 90 శాతం అందుతున్నాయి.దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోంది. ఈ సమస్యను పరిష్కరించాలి అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలి.బిసిలో ఎబిసిడి వర్గీకరణ వల్లే ఎవరి వాటా వారు అనుభవించగలుగుతున్నారు. వర్గీకరణతో బిసిల్లో చీలిక రానప్పుడు, ఎస్‌సిల్లో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు? షెడ్యూల్డ్ కులాల్లో మాదిగల కంటే వెనుకబడిన వారు కూడా ఉన్నారు. రెల్లి, పైడి, పాకితో పాటు చాలా ఉపకులాలు ఈ 50 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏ మాత్రం పొంద లేదు. వాళ్లను ఏం చేయాలి? రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ముద్ద వాళ్లకు పెట్టండి.
న్యాయాన్యాయాలతో ప్రమేయం లేకుండా అంతా మాకే దక్కాలనుకోలేను.మాదిగలు సంఘటితమై గొంతు విప్పిన తరువాతే కదా సమస్య చర్చకొచ్చింది. మరి ఆ ఉపతెగల వాళ్లు గొంతు విప్పే స్థితికి ఎప్పుడు రావాలి? దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటిదాకా వారికి రావలసిన వాటా ఏదీ అందకుండానే పోవాలా?రిజర్వేషన్ అంటే ఏమిటో, మానవ హక్కులు అంటే ఏమిటో తెలియని స్థితిలో వాళ్లింకా ఉన్నారు. వాళ్లకు చెందవలసిన అవకాశాల్ని వారికి ఇవ్వకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు.స్వార్థం అనేది మనిషిని ఎదుటి వారికి జరిగే అన్యాయాన్ని చూడనివ్వదు. మనము, మన కుటుంబం, మన వర్గం తప్ప మరి దేన్నీ పట్టించుకోనివ్వదు.అన్యాయం జరిగిన వర్గం వైపు ఉండాలనే నిజాయితీ ఉంటే, ఎదుటి వారికి జరిగిన అన్యాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.అదే మనిషికి స్థిరమైన నడక నేర్పుతుంది. (ఆంధ్రజ్యోతి 9.8.2013) ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కృష్ణ మాదిగ వికలాంగుల పక్షాన, హృద్రోగుల పక్షాన, వృద్ధులు, వితంతువుల పక్షాన కూడా పోరాటాలు చేశారు.
మానవీయ ఉద్యమాలు
[మార్చు]భారతదేశం అనేక సామాజిక ఉద్యమాలకు నిలయం ఉన్నది దానితో పాటు ఇక్కడ కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈలాంటి సమయంలో కులం, మతం పరమైన అంశాలను పక్కన పెట్టి మానవత దృక్పదంతో అలోచించి ఫులే, అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు నడుస్తూ వివద రకాలైన ఉద్యమ నాయకులు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. దండోరా ఉద్యమం మాదిగ కులాల కేంద్రంగా ప్రరంబమైనప్పటికి విశాల సర్వజనిన సమస్యలపైన మానవీయ కోణం లో, కుల మతాలకు అతీతంగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, అసమానతలకు, నిరాదరణకు గురైన 1. వికలాంగులు 2. వృద్దులు 3. వితంతువుల 4. చిన్న పిల్లల గుండె ఆపరేషన్ ఉద్యమాలకు మాతృకగా నిలిచి అస్తిత్వా లేదా గుర్తింపు రాజకీయాల పరిదిని దాటి పోరాటాలను నిర్మించడం ద్వారా ఒక కొత్త ఒరవడిని ఆదర్శాలను ప్రజా ఉద్యమాలకు అందించింది.అంతేకాకుండా ఈ బాదితసమూహాలకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి కారణమైంది. ఐతే ఈ మానవీయ ఉద్యమాల నేపథ్యంలో వస్తున్నా అనేక చర్చనీయ అంశాలను, ప్రభుత్వ పాలసీ విధానాలను, సవాళ్ళను సంక్లిష్టతలను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎంతైనా ఉంది.కానీ ఆంధ్ర ప్రదేశ్ మంద కృష్ణ మాదిగ గారు తనదైన పద్ధతిలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాజంలో వివిధ రకాలైన వివక్షతలను ఎదురుకుంటున్న వర్గాలకు నేను మీకు అండగా ఉంది మీ సంక్షేమానికి తోడ్పడుతానని ముందుకు వచ్చి నిలబడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వర్గాల సంక్షేమానికి తోడ్పాటు ఇచ్చే విధంగా చెయ్యటం జరిగింది అందులో ప్రధాన ఉద్యమాలు.
గుండె జబ్బు చిన్నారుల
[మార్చు]వై ఎస్ రాజశేకర్ రెడ్డి ప్రభుత్వంలో (2005) ఆంధ్ర ప్రదేశ్ లో గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం చెయ్యాలనే దృక్పదంతో మంద కృష్ణ మాదిగ గారు దండోరా అద్వర్యంలో ఉద్యమానికి స్వీకారం చుట్టారు. [citation needed]
వికలాంగుల ఉద్యమం
[మార్చు]వికలాంగుల హక్కుల ఉద్యమం ...చాల కలం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గాలను నిర్లక్ష్యం చెయ్యడం వాళ్ళ ఈ వర్గాలకు చిందిన వారు సామాజిక పరంగా, కుటుంబపరంగా, విద్య పరంగానే కాకా వివిధ రూపాలలో వివక్షతలు ఎదురుకోవడం జరిగింది. ఈ వర్గాలకు సరైన న్యాయం చెయ్యాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్మించడం జరిగింది. ఈ ఉధ్యమంకారణం గానే నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వికలాంగులు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ ను పొందుతున్నారు.
బయటి లింకులు
[మార్చు]- మంద కృష్ణ మాదిగ తో ఆంధ్రజ్యోతి దినపత్రిక వేమూరి రాధాకృష్ణ జరిపిన ముఖాముఖి
- మంద కృష్ణ మాదిగ తో ముఖాముఖి
మాదిగ లకు ఆత్మ గౌరవం తెచ్చిన ఉద్యమ కారుడు, జాతి కోసం దేని కైనా సిద్దపడే వాడు. నూతన పంథాలో ఉధ్యమాలను నిర్మిస్తుంటాడు.
- ↑ "Full list of Padma Awards 2025" (in Indian English). The Hindu. 25 January 2025. Archived from the original on 25 January 2025. Retrieved 25 January 2025.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- All articles with unsourced statements
- Articles with unsourced statements from July 2018
- 1965 జననాలు
- వికలాంగుల ఉద్యమం
- దళిత రచయితలు
- వరంగల్లు గ్రామీణ జిల్లా రాజకీయ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా ఉద్యమకారులు
- CS1 Indian English-language sources (en-in)