మండపాక పార్వతీశ్వర శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండపాక పార్వతీశ్వర శాస్త్రి
జననం30 జూన్, 1833
పాలతేరు
మరణం30 జూన్, 1897
తల్లిదండ్రులు

మండపాక పార్వతీశ్వర శాస్త్రి (జూన్ 30, 1833 - జూన్ 30, 1897) పేరెన్నికగన్న సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరు శతాధికాలైన కృతులను రచించారు.

జననం

[మార్చు]

ఇతను విజయనగరం జిల్లా , బాడంగి మండలం లోని పాల్తేరు గ్రామంలో 1833 సంవత్సరం జూన్ 30 తేదీన జన్మించారు. ఈయన వేగినాటి వైదిక బ్రాహ్మణుడు, ఆపస్తంబ సూత్రుడు, పారాశర గోత్రుడు. ఇతని తండ్రి మండపాక కామకవి, తల్లి జోగమాంబ. ఈతని పితామహుడు మండపాక పేరయసూరి. వీరు 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అచటనే ఉన్నారు. .

రచనలు

[మార్చు]

ఏకప్రాస శతకాలు

[మార్చు]
  • బ్రహ్మేశ శతకము (లలాట ప్రాసం)
  • చిత్త్రిశశి (నకార ప్రాసం)
  • వేంకటశైల నాయక ద్విశతి (లకార ప్రాసం)
  • వేంకటశైల నాయక శతకము (దకార ప్రాసం)
  • విశ్వనాయక శతకము (రకార ప్రాసం)
  • విశ్వనాథస్వామి శతకము (నకార ప్రాసం)
  • కాశీ విశ్వనాథ శతకము (కకార ప్రాసం)
  • పార్థవలింగ శతకము
  • పరమశివ శతకము (సకార ప్రాసం)
  • సూర్యనారాయణ శతకము (యకార ప్రాసం)
  • బాలశశాంక మౌళి శతకము
  • చంద్ర ఖండ కలాప శతకము
  • కలి పురుష శతకము
  • ఈశ్వర శతకము
  • ఈశ్వర ధ్యాన శతకము

ఇతర శతకాలు

[మార్చు]
  • సీతారామ ద్వ్యర్థి శతకము
  • శ్రీ జనార్ధన శతకము
  • కాశికా విశ్వనాథ శతకము
  • పరమాత్మ శతకము
  • పార్వతీశ్వర శతకము
  • కాశీ విశ్వనాథ ప్రభూ శతకము
  • సర్వేశ్వర శతకము
  • సూర్యనారాయణ శతకము
  • వేంకట రమణ శతకము
  • వరాహ నారసింహ శతకము
  • జగద్రక్షక శతకము
  • రమా నాయక శతకము
  • ఆంజనేయ శతకము
  • రామరక్షా శతకము
  • గోపాల కృష్ణ శతకము
  • బాలకృష్ణ శతకము
  • రఘుపతి శతకము
  • జగన్నాయక శతకము
  • రామలింగేశ్వర శతకము
  • సర్వకామదా శతకము
  • గణపతి శతకము
  • హరి శతకము
  • హరి హరేశ్వర శతకము

కావ్యాలు

[మార్చు]
  • రాధాకృష్ణ సంవాదము
  • శ్రీ బొబ్బిలి మహారాజ వంశావళి
  • ఉమాసంహిత
  • కాంచీ మహాత్మ్యము
  • అమరుకము
  • అక్షరమాలికాఖ్య నిఘంటువు

దండకాలు

[మార్చు]
  • శ్రీ రామ దండకము
  • శ్రీ సూర్యనారాయణ దండకము
  • శ్రీ జగదంబా దండకము
  • జూబిలీ దండకము

ఉపన్యాసాలు

[మార్చు]
  • సకల మత సామరస్య సంగ్రహోపన్యాసము
  • దైవ మానుషోపన్యాసము
  • కర్మ విపాకోపన్యాసము
  • స్త్రీ పునర్వివాహధిక్క్రియోపన్యాసము
  • భాగవతోపన్యాసము
  • ప్రబంధ సంబంధ బంధ నిబంధన క్రమము.
  • యాత్రా చరిత్ర పూర్వభాగము[1] (1915)
  • పాలవెల్లి[2],

తేనెపట్టు[3]

మరణం

[మార్చు]

వీరు 1897 జూన్ 30 తేదీన పరమపదించారు

మూలాలు

[మార్చు]