భూమిక:ద రోల్
భూమిక | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | శ్యామ్ బెనగళ్ గిరీష్ కర్నాడ్ సత్యదేవ్ దూబే(మాటలు) |
కథ | హంస వాడ్కర్ |
దీనిపై ఆధారితం | హంస వాడ్కర్ రాసిన సాంగ్టీ ఐకా ఆధారంగా |
నిర్మాత | లలిత్ ఎం. బిజ్లానీ ఫ్రెని వారియావా |
తారాగణం | స్మితా పాటిల్ అమోల్ పాలేకర్ అనంత్ నాగ్ |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహలానీ |
కూర్పు | భానుదాస్ దివాకర్ రామ్నిక్ పటేల్ |
సంగీతం | వనరాజ్ భాటియా మజ్రూహ్ సుల్తాన్ పురి వసంత్ దేవ్(సాహిత్యం) |
పంపిణీదార్లు | షెమరూ మూవీస్ |
విడుదల తేదీ | 1977, నవంబరు 11 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
భూమిక, 1977 నవంబరు 11న విడుదలైన హిందీ సినిమా. షెమరూ మూవీస్ బ్యానరులో లలిత్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావా నిర్మాణంలో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్మితా పాటిల్, అమోల్ పాలేకర్, అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి తదితరులు నటించారు.[1]
ఈ సినిమా జాతీయ ఉత్తమ నటి (స్మితా పాటిల్), జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా 1978 కార్తేజ్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అక్కడ ఈ సినిమాకు గోల్డెన్ ఫలకం 1978 లభించింది. 1986లో అల్జీరియాలోని ఫెస్టివల్ ఆఫ్ ఇమేజెస్‌కు కూడా ఆహ్వానించబడింది.[2]
నటవర్గం
[మార్చు]- స్మితా పాటిల్ (ఊర్వశి అలియాస్ ఉషా)
- అమోల్ పాలేకర్ (కేశవ్ దల్వి)
- అనంత్ నాగ్ (రాజన్)
- అమ్రీష్ పురి (వినాయక్ కాలే)
- నసీరుద్దీన్ షా (సునీల్ వర్మ)
- దిన పాఠక్ (శ్రీమతి కాలే, వినాయక్ తల్లి)
- కుల్ భూషణ్ ఖర్బందా (సినిమా నిర్మాత హరిలాల్)
- సులభా దేశ్‌పాండే (శాంత)
- కిరణ్ వైరాలే (సుష్మా దల్వీ)
- మోహన్ అగషే (సిద్ధార్థ్ సుతార్)
- బెంజమిన్ గిలానీ (సావాన్ కే దిన్ ఆయే పాటలో మొఘల్ యువరాజు)
- అభిషేక్
- బేబీ రుఖ్సానా (చిన్నప్పటి ఉష)
- బి.వి. కారంత్ (ఉష తండ్రి)
- కుసుమ్ దేశ్‌పాండే (శాంత తల్లి)
- రేఖా సబ్నిస్ (శ్రీమతి యశ్వంత్ కాలే)
- బేబీ బిట్టో (చిన్నారి సుష్మ)
- జి.ఎం. దురానీ (సంగీత ఉపాధ్యాయురాలు)
- సుదర్శన్ ధీర్ (నృత్య దర్శకుడు)
- మాస్టర్ అభితాబ్ (దీను)
- సునీలా ప్రధాన్ (నటి శ్రీమతి బాల ది ప్రిన్సెస్)
- ఓం పురి ('ఈవిల్ కింగ్' రంగస్థల నటుడు)
- సవితా బజాజ్ (బసంతి)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: శ్యామ్ బెనగళ్
- నిర్మాత: లలిత్ ఎం. బిజ్లానీ, భీషమ్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావా, సిల్లూ ఎఫ్. వారియవా
- రచయిత: హంస వాడ్కర్ (మరాఠీ నవల "సాంగ్టీ ఐకా" ఆధారంగా)
- స్క్రీన్ ప్లే: శ్యామ్ బెనగళ్, గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దూబే
- డైలాగ్స్: సత్యదేవ్ దూబే
- సినిమాటోగ్రాఫర్: గోవింద్ నిహలానీ
- ఎడిటర్: భానుదాస్ దివాకర్, రామ్నిక్ పటేల్
- కాస్ట్యూమ్స్: కల్పనా లజ్మి
- నృత్య దర్శకుడు: సుదర్శన్ ధీర్
నిర్మాణం
[మార్చు]1940, 50లలో మరాఠీ థియేటర్, సినిమా గురించి హన్సా వాడ్కర్ రచయిత 1959లో రాసిన సాంగ్టీ ఐకా అనే ఆత్మకథ ఆధారంగా రూపొందించబడింది. ఈ జీవితచరిత్రను జర్నలిస్ట్ అరుణ్ సాధుకు చెప్పబడింది.[3]
ఈ సినిమా మహారాష్ట్ర ప్రాంత నేపథ్యంలో రూపొందింది. బెనగల్ మునుపటి సినిమాలు ఆంధ్రా ప్రాంత నేపథ్యంలో ఉండేవి. ఈ ప్రాంతం గురించి తెలియని కారణంగా, స్క్రిప్ట్ సహ-రచన కోసం స్క్రీన్ రైటర్, నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌ని తీసుకున్నాడు. నాటకరంగ దర్శకుడు, నాటక రచయిత సత్యదేవ్ దూబే సంభాషణలు రాశాడు. నాన్-లీనియర్ కథనంతో పాటు, ఈ సినిమా కథలో కథ విధానాన్ని ఉపయోగించింది.[4]
నటి 22 ఏళ్ల స్మితా పాటిల్ సినిమారంగానికి కొత్తగా వచ్చింది. ప్రారంభంలో ఈ పాత్ర చాలా కష్టంగా అనిపించింది. అయినప్పటికి దానిని సమర్థవంతంటా పోషించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. నేడు తన కెరీర్‌లో అత్యుత్తమ నటనలలో ఒకటిగా పరిగణించబడుతోంది.[5][6][7]
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
25వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1977) | స్మితా పాటిల్[8] | జాతీయ ఉత్తమ నటి | గెలుపు |
శ్యామ్ బెనగళ్, గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దూబే[8] | జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే | గెలుపు | |
1978 | లలిత్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావా | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్రం | గెలుపు |
స్మితా పాటిల్ | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "Bhumika (1976)". Indiancine.ma. Retrieved 2021-08-04.
- ↑ Shyam Benegal Awards
- ↑ "Bhumika – Film (Movie) Plot and Review". Film Reference. Retrieved 2021-08-04.
- ↑ Kumar, Anuj (17 July 2014). "Bhumika (1977)". The Hindu. Retrieved 2021-08-04.
- ↑ Kumar, Anuj (17 July 2014). "Bhumika (1977)". The Hindu. Retrieved 2021-08-04.
- ↑ Vaiju Mahindroo (19 November 2011). "'Hansa Wadkar' is the most difficult film I have done so far: Smita Patil". India Today. Retrieved 2021-08-04.
- ↑ Dinesh Raheja; Jitendra Kothari. "The Best of Smita Patil – Bhumika". Rediff.com. Retrieved 2021-08-04.
- ↑ 8.0 8.1 "25th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 6–7. Archived from the original (PDF) on 30 జనవరి 2013. Retrieved 4 ఆగస్టు 2021.