భూపేష్ గుప్తా
Bhupesh Gupta | |
---|---|
Member of Parliament, Rajya Sabha | |
In office 1952–1981 | |
నియోజకవర్గం | West Bengal |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Itna, Mymensingh District, Bengal Province, British India | 1914 అక్టోబరు 20
మరణం | 1981 ఆగస్టు 6 Moscow, Russian SFSR, Soviet Union | (వయసు 66)
తండ్రి | Mahesh Chandra Gupta |
వృత్తి | Parliamentarian |
భూపేష్ గుప్తా (20 అక్టోబరు 1914 – 6 ఆగస్టు 1981) భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. [1]
అతను రాజ్యసభ సీనియర్ కమ్యూనిస్టు నాయకులలో, పార్లమెంటు సభ్యులలో ఒకడు. 1952 మే 13న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అతను 1981లో మరణించే వరకు ఆ పదవిలో కొనసాగాడు. అతను మరణించే సమయానికి రాజ్యసభలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యుడిగా ఉన్నాడు. [2]
అతను 1914 అక్టోబరు 20న బ్రిటిష్ ఇండియా బెంగాల్ ప్రావిన్స్ పూర్వపు మైమెన్సింగ్ జిల్లా ఇట్నా గ్రామంలో జన్మించాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయం స్కాటిష్ చర్చి కళాశాలలో చదువుకున్నాడు.[1] భూపేష్ గుప్తా తన ప్రారంభ సంవత్సరాల్లో బెంగాల్ విప్లవాత్మక సమూహం అనుశీలన సమితి చురుకుగా ఉన్నప్పుడు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.[3][4]
అతను యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి తన బారిస్టర్-ఎట్-లా పూర్తి చేశాడు. లండన్ లోని మిడిల్ టెంపుల్ నుండి బార్ గా పిలువబడ్డాడు. [1]ఇంగ్లాండ్ లో అతను ఇందిరా గాంధీకి సన్నిహిత స్నేహితునిగా ఉన్నాడు. ఎందుకంటే వారిద్దరూ ఇండియా లీగ్ కార్యకలాపాలలో పాల్గొన్నారు. అయితే వారి రాజకీయ విశ్వాసం తరువాత కాలంలో భిన్నంగా ఉండేది. [5][3] [need quotation to verify]
తరువాతి జీవితం
[మార్చు]1952 మే 13 నుండి తన మరణం వరకు పశ్చిమ బెంగాల్ నుండి ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. 1958, 1964, 1970, 1976లలో ఆయన తిరిగి ఎన్నికయ్యాడు. అతను నైపుణ్యం కలిగిన పార్లమెంటు సభ్యుడు. అతను ఆగష్టు 6,1981 న మాస్కోలో మరణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Eminent Parliamentarian Monograph Series - Bhupesh Gupta (PDF). New Delhi: Lok Sabha Secretariat. October 1990. p. 1. Retrieved 4 April 2024.
- ↑ Eminent Parliamentarian Monograph Series - Bhupesh Gupta (PDF). New Delhi: Lok Sabha Secretariat. October 1990. p. 8. Retrieved 4 April 2024.
- ↑ "Bhupesh: Some Reminiscences". Mainstream magazine.
- ↑ "Remembering Bhupesh Gupta on his Birth Centenary". Mainstream magazine.
- ↑ "Indira Wanted Soviets On Board For The Emergency". The New Indian Express.
- ↑ Eminent Parliamentarian Monograph Series - Bhupesh Gupta (PDF). New Delhi: Lok Sabha Secretariat. October 1990. p. 11. Retrieved 4 April 2024.