భూపాల్ రెడ్డి
భూపాల్ రెడ్డి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1959 (age 65–66) |
కలం పేరు | భూపాల్ |
వృత్తి | రచయిత, నటుడు |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఏ.(తెలుగు), పిహెచ్.డి |
గుర్తింపునిచ్చిన రచనలు | ఉగ్గు పాలు |
పురస్కారాలు | సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం - 2011 |
ఎం.భూపాల్ రెడ్డి (జ.1959) ఒక తెలుగు రచయిత, సినిమా నటుడు. ఇతనికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇతడు వ్రాసిన ఉగ్గుపాలు అనే కథాసంపుటికి ఈ అవార్డును ప్రదానం చేశారు.[1]
తొలినాళ్లు
[మార్చు]భూపాల్ రెడ్డి హైదరాబాదు సమీపంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. బాల్యంలో పొట్టకూటి కోసం భూపాల్ రెడ్డి తమ రెండెకరాల పొలంలో పనిచేసేవాడు. ఇతడు అంబర్‌పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, ఛాదర్‌ఘాట్ హైస్కూలులో మాధ్యమిక విద్య పూర్తి చేశాడు. ఇంటర్‌మీడియట్, డిగ్రీ న్యూసైన్స్ కళాశాలలోను, స్నాతకోత్తర విద్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను చదివాడు. ప్రముఖ కవి పొట్లపల్లి రామారావుపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తన పి.హెచ్.డి.ని సంపాదించాడు.
రచనలు
[మార్చు]భూపాల్ రెడ్డి 19కి పైగా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో కొమరం భీం, నెమలికన్ను, పట్నమొచ్చిన పల్లె, ఉగ్గుపాలు మొదలైనవి ఉన్నాయి. [2]
అవార్డులు
[మార్చు]- కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం - ఉగ్గుపాలు - 2011