భూపాలపల్లి రెవెన్యూ డివిజను
భూపాలపల్లి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ భూపాలపల్లి |
భూపాలపల్లి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోవున్న ఒక రెవెన్యూ డివిజన్ ఇది. ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం భూపాలపల్లి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]భూపాలపల్లి డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | భూపాలపల్లి రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | భూపాలపల్లి మండలం | 21 రెవెన్యూ గ్రామాలు (1 రెవెన్యూ గ్రామం) |
2 | ఘనపూర్ మండలం | 9 రెవెన్యూ గ్రామాలు (1 రెవెన్యూ గ్రామం) |
3 | రేగొండ మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
4 | మొగుళ్ళపల్లి మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
5 | చిట్యాల మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
6 | టేకుమట్ల మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
7 | మల్హర్రావు మండలం | 22 రెవెన్యూ గ్రామాలు (5 రెవెన్యూ గ్రామాలు) |
8 | కాటారం మండలం | 31 రెవెన్యూ గ్రామాలు (3 రెవెన్యూ గ్రామాలు) |
9 | మహాదేవ్‌పూర్ మండలం | 32 రెవెన్యూ గ్రామాలు (7 రెవెన్యూ గ్రామాలు) |
10 | పల్మెల మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (5 రెవెన్యూ గ్రామాలు) |
11 | ముత్తారం మండలం | 22 రెవెన్యూ గ్రామాలు (1 రెవెన్యూ గ్రామం) |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-23.
- ↑ "Revenue Villages | Jayashankar Bhupalpally District | India". Archived from the original on 2021-01-21. Retrieved 2022-05-23.
- ↑ "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-05-23.