భూక్యా జాన్సన్ నాయక్
భూక్యా జాన్సన్ నాయక్ | |||
నియోజకవర్గం | ఖానాపూర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిమ్మాపూర్ తండా, ఇబ్రహీంపట్నం మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ భారతదేశం | 1976 జూన్ 6||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | భుక్యా శామ్యూల్ నాయక్, కేస్లిబాయి | ||
జీవిత భాగస్వామి | భూక్యా జయలక్ష్మీబాయి | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
భూక్యా జాన్సన్ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]భూక్యా జాన్సన్ నాయక్ తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా,ఇబ్రహీంపట్నం మండలం, తిమ్మాపూర్ తండాలో జన్మించాడు. ఆయన నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ ఆ తర్వాత ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమో పూర్తి చేసి కొంత కాలం పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.
రాజకీయ జీవితం
[మార్చు]భూక్యా జాన్సన్ నాయక్ స్వదేశానికి తిరిగి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్‌ను మార్చి పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించింది.[3][4] ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు చేతిలో 4289 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (6 November 2023). "భూక్యా జాన్సన్ నాయక్". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
- ↑ Eenadu. "మూడు చోట్ల మార్పు.. కారు టికెట్ల కూర్పు". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
- ↑ Sakshi (22 August 2023). "ఖానాపూర్ నియోజకవర్గం". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.