భీమవరపు లక్ష్మయ్య
స్వరూపం
భీమవరపు లక్ష్మయ్య ప్రముఖ రంగస్థల నటులు.
జననం
[మార్చు]లక్ష్మయ్య గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతానికి చెందినవారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]లక్ష్మయ్య 1952లో అభ్యుదయ నాటక సమితి అనే ఒక నాటక సమాజాన్ని స్థాపించారు. కె. రాధ, తాళ్లూరి రాఘవేంద్రరావు, ఆర్.వి.ఆర్. ఆచారి వంటి నాటక ప్రముఖులతో కలిసి కూలిపిల్ల, వేమన నాటకాల్ని అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు.
తెనాలి పట్టణంలో నసరయ్య నిర్వహిస్తున్న జనతా ఆర్ట్ థియేటర్ లో చేరి ఆ సంస్థ ప్రదర్శించిన నాటకాలన్నింటిలో నటించారు. అనేక పరిషత్తులలో బహుమతలు పొందారు.
నటించిన నాటకాలు - పాత్రలు
[మార్చు]- భయం - ముసలయ్య
- హిమజ్వాల - ముసలివాడు
- చీకటి తెరలు - చంద్రయ్య
- కీర్తిశేషులు - శంకరయ్య
- సీతారామరాజు - పిళ్లై
- కూలిపిల్ల
- వేమన
- కాంతాకనకం
- తుఫాన్
- తులసీతీర్థం
- విశ్వనాధవిజయం
- నటన
- నటనాలయం
సినిమారంగం
[మార్చు]మిత్రుని ప్రోత్సాహంతో 'ఇదా ప్రపంచం' అనే సినిమాలో నటించారు.
ప్రస్తుతం
[మార్చు]తపాల శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం తెనాలి లోఉంటున్నారు.
మూలాలు
[మార్చు]- భీమవరపు లక్ష్మయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 233.