భారతమాత దేవాలయం
భారతమాత దేవాలయం | |
---|---|
भारत माता मंदिर | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°19′02″N 82°59′21″E / 25.317209°N 82.989291°E |
దేశం | Indiaభారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | వారణాసి |
ప్రదేశం | మహాత్మాగాంధీ విద్యాపీఠం, వారణాసి |
ఎత్తు | 83.67 మీ. (275 అ.) |
సంస్కృతి | |
దైవం | భారతమాత |
ముఖ్యమైన పర్వాలు | స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1936 |
సృష్టికర్త | శివప్రసాద్ గుప్త |
భారతమాత దేవాలయం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో ఉంది. సంప్రదాయ దేవతల విగ్రహాలకు బదులుగా, ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన అఖండ భారతదేశ భారీ శిల్పం ఉంది. ఈ దేవాలయంలోని ప్రధాన ఆరాధ్య దైవం భారత మాత కాబట్టి దీన్ని భారత మాతకు అంకితం చేయబడింది. ప్రపంచంలోని భారత మాతకు చెందిన దేవాలయాలలో ఇదే మొట్టమొదటిది.[1][2][3][4]
చరిత్ర
[మార్చు]1936లో స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ శివప్రసాద్ గుప్తా చేత నిర్మించబడిన భారత మాతా మందిరాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించాడు. ఈ ఆలయం మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో నిర్మించబడింది.[1][2]
నిర్మాణం
[మార్చు]భారత మాత మందిరం రాతితో నిర్మించబడింది. ఇది అవిభాజ్య భారతదేశానికి ప్రతీకగా పాలరాతితో నిర్మించిన భారత మాత విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన భారతదేశం రిలీఫ్ మ్యాప్ కూడా ఉంది. మ్యాప్ లో పర్వతాలు, మైదానాలు, మహాసముద్రాలు గుర్తించబడ్డాయి.[5]
వివిధ ప్రదేశాల నుండి దూరం
[మార్చు]భారత మాత మందిరం మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ఆవరణలో ఉంది. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు దక్షిణంగా 1.5 కిలోమీటర్ల దూరంలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి సమీపంలో ఈ భారత మాత ఆలయం ఉంది.[6]
చిత్రాలు
[మార్చు]-
ఆలయంలోని భారతదేశ పటం
-
ఆలయంలోని భారతదేశ పటం
-
ఆలయంలోని భారతమాత చిత్రపటం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Bharat Mata Mandir". varanasi.org. Retrieved 3 March 2015.
- ↑ 2.0 2.1 "Bharat Mata". varanasicity.com. Retrieved 3 March 2015.
- ↑ "LP". Lonely Planet. Retrieved 3 March 2015.
- ↑ "Temple news". The Times of India. Retrieved 3 March 2015.
- ↑ Karkar, S.C. (2009). The Top Ten Temple Towns of India. Kolkota: Mark Age Publication. p. 11. ISBN 978-81-87952-12-1.
- ↑ "Location". Google Maps. Retrieved 3 March 2015.