Jump to content

భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

వికీపీడియా నుండి

భారతదేశం, అనేక దేశాలతో, వాణిజ్య సముదాయాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు), ఇతర వాణిజ్య ఒప్పందాలలో భాగస్వామిగా ఉంది. అనేక ఇతర దేశాలతో ఒప్పందాలపై చర్చలు జరుపుతోంది. 2022 నాటికి, భారతదేశం 50 పైచిలుకు దేశాలతో ప్రాధాన్యతా ఒప్పందాలు, ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.

భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు 88 రోజుల్లో పూర్తయ్యాయి. భారతదేశం అత్యంత స్వల్ప వ్యవధిలో సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.[1]

అవలోకనం

[మార్చు]

వివిధ దేశాలు, ట్రేడ్ బ్లాక్‌లతో ప్రాధాన్యతను ఇవ్వడం కోసం భారతదేశం వివిధ రకాల వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ఒప్పందాలు (PTA), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA), సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు (CECA), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు (CEPA) వఈటిలో ఉన్నాయి.[2]

ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (PTA)లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములు అంగీకరించిన ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి అంగీకరిస్తారు. భాగస్వాములు సుంకాన్ని తగ్గించడానికి అంగీకరించే ఉత్పత్తుల జాబితాను సానుకూల జాబితా అంటారు. సాధారణంగా, PTA లు యావత్తు వాణిజ్యాన్నీ కవర్ చేయవు. భారత్ సంతకం చేసిన మెర్కోసర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ PTAకి ఒక ఉదాహరణ. [2]

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో (FTA), భాగస్వామి దేశాల మధ్య వర్తకం చేసే వస్తువులపై సుంకాలను తగ్గించడం లేదా తొలగించడం ఉంటుంది. అయితే ఒప్పందం లోని భాగస్వాములు, సభ్యులు కాని దేశాల పట్ల తమ స్వంత టారిఫ్ వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. FTA, PTA ల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, PTAల్లో సుంకాన్ని తగ్గించాల్సిన ఉత్పత్తుల సానుకూల జాబితా (పాజిటివ్ లిస్ట్) ఉంటుంది. అయితే FTA ల్లో ప్రతికూల జాబితా (నెగటివ్ లిస్ట్) ఉంటుంది. దానిపై సుంకం తగ్గించరు, తొలగించరు. కాబట్టి, PTAతో పోలిస్తే, FTAలు సాధారణంగా సుంకం తగ్గించాల్సిన వస్తువుల కవరేజీలో మరింత ఉదాత్తంగా ఉంటాయి. భారతదేశం, శ్రీలంకల మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAకి ఒక ఉదాహరణ.[2]

సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (CECA), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలలో (CEPA) వస్తువులు, సేవలు, పెట్టుబడులపై సమగ్రమైన ప్యాకేజీ ఉంటుంది. అలాగే మేధో సంపత్తి, ప్రభుత్వ సేకరణ, సాంకేతికత, ప్రమాణాలు, శానిటరీ, ఫైటోశానిటరీ వంటి రంగాలలో సులభమైన నియమాలను రూపొందించి, వాణిజ్య సౌలభ్యానికి తోడ్పడతాయి. భారత కొరియాల మధ్య ఉన్న ఒప్పందం CEPA కు ఉదాహరణ. ఇది కస్టమ్స్ సహకారం, పెట్టుబడి, పోటీ, మేధో సంపత్తి హక్కులు మొదలైన అనేక ఇతర రంగాలను కవర్ చేస్తుంది. CECA/CEPAలు ప్రాంతాల కవరేజీ, కట్టుబాట్ల పరంగా FTAల కంటే మరింత సమగ్రమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. సాంప్రదాయిక FTA ప్రధానంగా వస్తువులపై దృష్టి సారిస్తుండగా, CECA/CEPA సేవలు, పెట్టుబడి, పోటీ, ప్రభుత్వ సేకరణ, వివాదాలు మొదలైన అనేక రంగాలను సమగ్రంగా కలుపుకుని ఉంటాయి. ఇంకా, CECA/CEPA లు వాణిజ్య నియంత్రణ అంశాలపై FTA కంటే లోతుగా వ్యహరిస్తాయి. దీని కారణంగా, వీటిలో భాగస్వాముల నియంత్రణ విధానాలకు సంబంధించిన పరస్పర గుర్తింపు ఒప్పందాలు (MRAలు) కూడా భాగంగా ఉంటాయి. MRA అనేది, ఒకే అంతిమ లక్ష్యాలను సాధిస్తారనే భావనతో భాగస్వాముల విభిన్న నియంత్రణ విధానాలను గుర్తిస్తుంది. [2]

ద్వైపాక్షిక ఒప్పందాలు

[మార్చు]
దేశం. ఒప్పందం పేరు రకం సంతకం చేశారు. ప్రభావవంతంగా రిఫరెండెంట్.
 Afghanistan భారత ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం పిటిఎ 2003 మార్చి 6 2003 మే 13 [3][4]
 Australia ఆస్ట్రేలియా-ఇండియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (ఏఐ-సీఈసీఏ) సిఇసిఎ 2022 ఏప్రిల్ 2 2022 డిసెంబరు 29 [5][6]
 Chile ఇండియా-చిలీ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం పిటిఎ 2006 మార్చి 8 2007 సెప్టెంబరు 11 [7][8]
 Japan జపాన్-ఇండియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (JICEPA) సిఇపిఎ 2011 ఫిబ్రవరి 16 2011 ఆగస్టు 1 [7]
 Malaysia భారత మలేషియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (ఐఎమ్సిఇసిఎ) సిఇసిఎ 2011 ఫిబ్రవరి 8 2011 జూలై 1 [7]
 Mauritius భారతదేశం మారిషస్ సమగ్ర ఆర్థిక సహకారం, భాగస్వామ్య ఒప్పందం సిఇసిపిఎ 2021 ఫిబ్రవరి 22 2021 ఏప్రిల్ 1 [7]
 Thailand భారత థాయిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్ టి ఎ 2003 అక్టోబరు 9 2006 సెప్టెంబరు 1 [7]
 Singapore భారత సింగపూర్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం సిఇసిఎ 2005 జూన్ 29 2005 ఆగస్టు 1 [7]
 South Korea భారత కొరియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (ఐకెసిఇపిఎ) సిఇపిఎ 2009 ఆగస్టు 7 2010 జనవరి 1 [7]
 Sri Lanka భారత శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఐఎస్ఎఫ్టిఎ) ఎఫ్ టి ఎ 1998 డిసెంబరు 28 2000 మార్చి 1 [9]
 United Arab Emirates భారత యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఇపిఎ 2022 ఫిబ్రవరి 18 2022 మే 1 [10][11]

చర్చల దశలో ఉన్నవి

[మార్చు]

ప్రతిపాదనలో ఉన్నవి

[మార్చు]

బహుపాక్షిక ఒప్పందాలు

[మార్చు]
ఒప్పందం పేరు రకం దేశాలు/వాణిజ్య వ్యవస్థలు సంతకాలు చేసిన తేదీ అమలైన తేదీ మూలాలు.
ఆసియా-పసిఫిక్ వాణిజ్య ఒప్పందం (APTA) PTA బంగ్లాదేశ్, చైనా, లావోస్, మంగోలియా, దక్షిణ కొరియా, శ్రీలంక 1975
వస్తువుల ఒప్పందంలో ఆసియాన్-భారత్ వాణిజ్యం CECA  ASEAN  ASEAN 2009 ఆగస్టు 13 2010 జనవరి 1 [7]
ASEAN-India ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఒప్పందం నవంబరు 2014 2015 జూలై 1 [7] [17]
ASEAN-India పెట్టుబడి ఒప్పందం నవంబరు 2014 2015 జూలై 1 [7] [17]
గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ట్రేడ్ ప్రిఫరెన్సెస్ (GSTP) PTA 41 దేశాలు 1988 ఏప్రిల్ 13 1989 ఏప్రిల్ 19
ఇండియా మెర్కోసూర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ PTA  Mercosur  Mercosur 2004 జనవరి 25 2009 జూన్ 1 [7]
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (SAFTA) FTA దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) 2004 జనవరి 6 2006 జనవరి 1
భారతదేశ EFTA వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం TEPA EFTA 2024 మార్చి 10

చర్చల దశలో ఉన్నవి

[మార్చు]

వదిలేసిన ప్రతిపాదనలు

[మార్చు]
  • ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) [21]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రాధాన్యత
  • యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు
  • భారతదేశం-యునైటెడ్ కింగ్‌డమ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

మూలాలు

[మార్చు]
  1. "India UAE Trade: India-UAE trade deal to be operationalised from May 1: Piyush Goyal". The Times of India (in ఇంగ్లీష్). 29 March 2022. Retrieved 2022-04-05.
  2. 2.0 2.1 2.2 2.3 "FAQ on FTA" (PDF). Department of Commerce. 9 April 2014. Retrieved 5 April 2022.
  3. "India-Afghanistan PTA". Department of Commerce (in ఇంగ్లీష్). Retrieved 2022-04-05.
  4. "India-Afghanistan Preferential Trading Agreement Free Trade Agreement". aric.adb.org. Retrieved 2022-04-05.
  5. "India, Australia sign FTA, trade likely to 'double in 5 yrs, generate 1 mn jobs'". The Indian Express (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-05.
  6. "India-Australia FTA kicks off, nearly 96% exports get free access". Moneycontrol (in ఇంగ్లీష్). 29 December 2022. Retrieved 30 December 2022.
  7. 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 7.10 7.11 7.12 7.13 7.14 "Annual Report 2021-2022" (PDF). Department of Commerce. pp. 80–109. Retrieved 5 April 2022.
  8. "India-Chile Preferential Trading Agreement Free Trade Agreement". aric.adb.org. Retrieved 2022-04-05.
  9. "Free Trade Agreement" (PDF). Noida Special Economic Zone. Archived from the original (PDF) on 30 జూన్ 2022. Retrieved 19 June 2022.
  10. "What is India – UAE CEPA, how it will benefit both economies?". gulfnews.com (in ఇంగ్లీష్). 19 February 2022. Retrieved 2022-04-05.
  11. Suneja, Kirtika. "India-UAE free trade pact comes into force". The Economic Times. Retrieved 2022-05-10.
  12. "India, Canada formally agree to step up talks over FTA". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-03-12. Retrieved 2022-04-05.
  13. 13.0 13.1 13.2 "India's Trade Agreements - At a Glance". www.dezshira.com. 11 January 2018. Retrieved 2022-04-05.
  14. "India, UK Free Trade Agreement to boost cooperation in tourism, technology, startups, education, says Piyush Goyal". ANI News (in ఇంగ్లీష్). Retrieved 5 April 2022.
  15. "India looks to sign FTA with Oman". Muscat Daily (in ఇంగ్లీష్). 2021-10-10. Retrieved 2022-04-05.
  16. "Preparation of free trade agreement with Peru and Chile, many countries are interested in this with India". Sangri Today (in ఇంగ్లీష్). 2023-08-17. Retrieved 2023-08-17.
  17. 17.0 17.1 "ASEAN-India Free Trade Area (AIFTA)" (PDF). ASEAN. Retrieved 5 April 2022.
  18. "India, Russia-led Eurasian bloc to begin negotiations on FTA soon". 27 December 2023.
  19. "India, EU set to resume free trade talks after 9-year gap". Hindustan Times (in ఇంగ్లీష్). 19 June 2022. Retrieved 19 June 2022.
  20. "India, GCC Agree To Pursue Free Trade Agreement; Resume Talks: Piyush Goyal". Outlook. Retrieved 30 December 2022.
  21. "Rcep Trade Agreement: India decides to opt out of RCEP, says key concerns not addressed". The Economic Times. 5 November 2019. Retrieved 5 April 2022.