భాగ్యశ్రీ థిప్సే
భాగ్యశ్రీ థిప్సే | |
---|---|
పూర్తి పేరు | భాగ్యశ్రీ సాఠే థిప్సే |
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | 1961 ఆగస్టు 4 |
టైటిల్ | ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ |
ర్యాంకింగ్ | 15981 యాక్టీవ్ (1961) |
భాగ్యశ్రీ థిప్సే (జననం 1961 ఆగస్టు 4) ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదును కలిగిన భారతీయ చెస్ క్రీడాకారిణి.[1]
కెరీర్
[మార్చు]ఆమె 1985 (నాగ్‌పూర్), 1986 (జలంధర్), 1988 (కురుక్షేత్ర), 1991 (కోజికోడ్), 1994(బెంగళూరు)లలో ఐదుసార్లు భారతీయ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించింది. 1991లో భోపాల్ లో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[2] 1984లో ఆమె బ్రిటిష్ లేడీస్ ఛాంపియన్‌షిప్‌లో వాసంతి ఉన్నితో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది.[3][4] ఆమె మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2000లో పోటీ పడింది. అయితే మొదటి రౌండ్‌లో పెంగ్ జావోకిన్(Peng Zhaoqin) చేతిలో ఓడిపోయింది.
ఆమె ప్రస్తుతం ముంబైలోని ఐడీబీఐ(IDBI Bank)లో ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది.
వ్యక్తిగతం
[మార్చు]చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రవీణ్ థిప్సేతో వివాహమైన తర్వాత ఆమె తన పేరును భాగ్యశ్రీ సాఠే థిప్సేగా మార్చుకుంది.[5]
పురస్కారాలు
[మార్చు]ఆమెను భారతప్రభుత్వం 1987లో పద్మశ్రీ పురస్కారం, అర్జున అవార్డులతో సత్కరించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Thipsay, Bagyashree Sathe". web.archive.org. 2023-04-03. Archived from the original on 2023-04-03. Retrieved 2023-04-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ D.K. Bharadwaj (2003-05-13). "A big boom in the brain game". Press Information Bureau, Government of India.
- ↑ "Barua Finishes Third". ChessMate. October 1991. Archived from the original on 2004-11-24. Retrieved 1 March 2016.
- ↑ "British Champions 1904 – present". The English Chess Federation. Archived from the original on 26 June 2018. Retrieved 1 March 2016.
- ↑ "Bhagyashree is queen again". The Hindu. 2003-06-06. Archived from the original on 2014-03-20. Retrieved 2014-03-24.