భవానీ జంపఖానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భవానీ నందు తయారుకాబడిన జంపఖానాలు (రగ్గులు)

భవానీ జంపఖానా అనగా తమిళనాడు రాష్ట్రము లోని, ఈరోడ్ జిల్లా యందలి భవానీ నందు తయారు అయ్యే దుప్పట్లు, తివాచీలు గురించి సూచిస్తుంది. [1][2]భారతదేశం ప్రభుత్వం ద్వారా 2005-06 సంవత్సరములో వీటిని జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జి ఐ) అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం హోదాను పొందింది.[3]

భౌగోళిక గుర్తింపు సంకేతం

[మార్చు]

2005 సంవత్సరములో, తమిళనాడు ప్రభుత్వం భవానీ జంపఖానాలు యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం సమర్పించింది. [4]భారతదేశం యొక్క ప్రభుత్వం అధికారికంగా 2005-06 సంవత్సరం నుండి ఒక జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జి ఐ) అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం వలె గుర్తించింది.[3]

రకములు

[మార్చు]

రెండు రకాల జంపఖానాలు భవానీ నందు ఉత్పత్తి చేస్తారు. [5] మొదటి రకం రంగు వరుసల (బ్యాండ్లు) కలిగి ఉన్న తివాచీలు, ఉత్పత్తి సామర్థ్యం స్థూలంగా అధికంగా ఉండే కోర్సర్ (కాటన్) పత్తి (థ్రెడ్లు) దారములు నుండి తయారు చేస్తారు. [5] కోర్సర్ (కాటన్) పత్తి దారము (థ్రెడ్) స్థూలంగా లేక మందంగా ఉండటంతో, నమూనాలు లేదా డిజైన్లు కార్పెట్ ఈ రకంకు నేయడ మనేది సాధ్యం కాదు. [5]

అందువల్ల, రెండవ మృదువైన వివిధ రకములయిన జంపఖానాలు ప్రవేశపెట్టబడ్డాయి. వివిధ రకాల నమూనాలు, బోర్డర్లు, అందముగా తీర్చిద్దిద్దేందుకు చేనేత నేతపని వారికి అనుకూలంగా ఉండేందుకు ఈ రకం కృత్రిమ పట్టు దారాలతో తయారు చేయబడ్డాయి.[5] ఈ రకం జంపఖానాలు కూడా ఫ్యాషన్ దుస్తులు "బ్యాక్ ప్యాక్స్" వంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.[6]

కమ్యూనిటీ

[మార్చు]

సాంప్రదాయకంగా, జంపఖానాలు చేనేత కార్మికుల వారి ఇళ్లలో స్వతంత్రంగా నేసినవే అయి ఉంటాయి.[7] తరువాత, ఇది జంపఖానాలు నేత నేసేవారు నేసిన పేరు ఒక వ్యవస్థ రూపొందించబడి పుంజుకుంది, దీనిని మాస్టర్ చేనేత కార్మికులు పర్యవేక్షించారు.[8]మాస్టర్ చేనేత కార్మికులు ఒప్పందం లీజులో చేతి మగ్గాలు, చేనేత కార్మికులు ఉండటం జరుగుతుంది. చేతి మగ్గాలు వాణిజ్య వ్యాపారులు ఆధీనంలో ఉంటాయి. వీరు కోయంబత్తూరు, సేలం, కరూర్ వంటి పొరుగు నగరాలు నుండి దారము (థ్రెడ్) వంటి ముడి పదార్థాలను సేకరించుతారు.[9] షుమారుగా 1500 కార్మికులు కలిగి జంపఖానాలు ఉత్పత్తి యందు, స్త్రీలు ఒత్తిడి పనిలోకి దాదాపుగా మూడు వంతులలో రెండు వంతుల మంది ఉండేట్టు ఊంటారు..[10]

మగ్గం నేయడం

[మార్చు]

ఒక పిట్ మగ్గం జంపఖానాలు నేతకు ఉపయోగిస్తారు.[10] మగ్గాలు చెక్కతో తయారు చేస్తారు. దారాలు (థ్రెడ్లు) అడ్డంగా మొదలు నుండి ముగింపు వరకు అనగా ఒక చివర నుండి మరొక చివర వరకు విస్తరించి ఉంటాయి.[10] నేత నేసే ఉపరితలం స్థాయిలో నేల మీద త్రవ్విన ఒక గొయ్యి (పిట్) లో కూర్చుని నేత కార్మికుడు (వీవర్) నేయడము జరుగుతుంది.[10] నేత నమూనా ఉత్పత్తి కొరకు షటిల్ తరలించడానికి అడ్డంగా చేతులు నేయడము ప్రారంభిస్తుండగా, చేనేత కార్మికుని యొక్క రెండు కాళ్ళుతో మగ్గానికి ఉన్న రెండు పెడల్స్ ఉపయోగించాలి.[10]

గుర్తింపు

[మార్చు]

పట్టు దుస్తులు సేలం యొక్క ఏకైక బ్రాండ్. ఈ పట్టు కొరకు, అమ్మకాలు ఇంకా మంచి గుర్తింపు కోసం మార్గం సుగమం చేస్తూ, 1999 రూల్ 2003 చట్టం జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అధీకృత వినియోగదారు సర్టిఫికెట్ పొందింది. [11]

ఎగుమతులు

[మార్చు]

భవానీలో తయారు కాబడిన జంపఖానాలు స్వీడన్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సింగపూర్ వంటి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు.[12] 1993 సంవత్సరములో స్వీడిష్ దేశం లోని అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన ప్రధాన ఐకియా దుకాణం, దాని దుకాణాలు అంతటా వీటిని విక్రయించాలని నిర్ణయించి భవానీ నుండి జంపఖానా సేకరించడం ప్రారంభించారు.[12]

పోటీ

[మార్చు]

2000 సంవత్సరము నుండి, భవానీ నుండి తయారయిన చేతి మగ్గం జంపఖానాలు. పరర్‌లూం మగ్గం నేసిన ఉత్పత్తుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.[13] తమిళనాడు ప్రభుత్వం చేనేత కార్మికులకు సబ్సిడీని అందిస్తూ, పవర్ మగ్గాలు ఉపయోగం చట్టవిరుద్ధం అని చట్టాలను రూపొందించి అమలు చేసింది. [13] ప్రభుత్వం కూడా ప్రభుత్వ కో-అప్‌టెక్స్ దుకాణాల ద్వారా దుప్పట్లు విక్రయిస్తుంది. పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక నుండి దిగుమతులు చేసుకొని తయారు చేస్తున్న షోలాపూర్, మహారాష్ట్ర చౌక రకం ఉత్పత్తి చేసే దుప్పట్లు నుండి పోటీ వల్ల భవానీ జంపఖానాలు డిమాండ్ తగ్గడం బాగా ప్రతిఫలించింది. [13]

మూలాలు

[మార్చు]
  1. Parry; Breman; Kapadia. The worlds of Indian industrial labour. p. 380.
  2. de Neve. The Everyday Politics of Labour. p. 42.
  3. 3.0 3.1 "Geographical indications of India". Government of India. Archived from the original on 26 ఆగస్టు 2013. Retrieved 28 June 2015.
  4. "GI tag: TN trails Karnataka with 18 products". Times of India. 29 August 2013.
  5. 5.0 5.1 5.2 5.3 de Neve. The Everyday Politics of Labour. p. 87.
  6. "When passion met fashion". The Hindu. 13 April 2014.
  7. de Neve. The Everyday Politics of Labour. p. 167.
  8. de Neve. The Everyday Politics of Labour. p. 45.
  9. de Neve. The Everyday Politics of Labour. p. 44.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 de Neve. The Everyday Politics of Labour. p. 86.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-26. Retrieved 2016-01-26.
  12. 12.0 12.1 Assayag, Fuller. Globalizing India: Perspectives from Below. p. 93.
  13. 13.0 13.1 13.2 "No takers for Erode blankets". Deccan Chronicle. 31 March 2013.

గ్రంథ పట్టిక

[మార్చు]