భమిడిపాటి కామేశ్వరరావు
శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు | |
---|---|
జననం | భమిడిపాటి కామేశ్వర రావు ఏప్రిల్ 28, 1897 పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు |
మరణం | ఆగష్టు 28, 1958 |
ఇతర పేర్లు | హాస్య బ్రహ్మ, భ కా రా |
వృత్తి | ఉపాధ్యాయుడు, రచయిత |
ఉద్యోగం | వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాల |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రముఖ రచయిత, నటుడు, నాటక క |
పిల్లలు | భమిడిపాటి రాధాకృష్ణ |
తల్లిదండ్రులు |
|
భమిడిపాటి కామేశ్వరరావు (ఏప్రిల్ 28, 1897 - ఆగష్టు 28, 1958) రచయిత, నటుడు, నాటక కర్త. ఈయనకు హాస్య బ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది. వీరి కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ కూడా రచయిత.
జీవిత సంగ్రహం
[మార్చు]వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్థులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం, కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. త్యాగరాజు రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ త్యాగరాజు ఆత్మ విచారం రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు రాజమండ్రి కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన చంద్రగుప్తలో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు.
రచనలు
[మార్చు]భమిడిపాటి కామేశ్వర రావు గారు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామాజిక పరిస్థితులను తెలియచేస్తాయి. ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది. ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడా హాస్య ప్రధానమైనప్పటికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి.
నాటకాలు-నాటికలు
[మార్చు]- వినయప్రభ - ఆంగ్ల రచయిత ఒలివర్ గోల్డ్ స్మిత్ రచన షి స్టూప్స్ టు కాంకర్ (She stoops to conquer) ఈ నాటకానికి మూలం
- ఇప్పుడు - ఇందులో మూడు నాటికలు ఉన్నాయి
- బాగు బాగు - మొదటి ప్రదర్శన సెప్టెంబరు 1వ తారీకు 1923, రాజమండ్రిలో
- ఎప్పుడూ ఇంతే - మొదటి ప్రదర్శన సెప్టంబరు 5వ తారీకు 1926, రాజమండ్రిలో
- క చ ట త పలు - మొదటి ప్రదర్శన ఆగష్టు 31వ తారీకు 1927, రాజమండ్రిలో
- అప్పుడు - ఇందులో మూడు నాటికలు ఉన్నాయి
- తప్పనిసరి - మొదటి ప్రదర్శన ఆగస్టు 27వ తారీకు 1930
- వద్దంటే పెళ్ళి - మొదటి ప్రదర్శన ఆగస్టు 23వ తారీకు 1931
- ఘటన - మొదటి ప్రదర్శన మార్చి 7వ తారీకు 1932
- పై మూడు నాటికలూ ఫ్రెంచి రచయిత మోలియర్ రచనలకు తెలుగు అనువాదాలు
కథలు
[మార్చు]- తమ్ముడు పెళ్ళికి తరలి వెళ్ళడం
- విమానం
- దోమరాజా
- అయోమార్గం
- అభినందనం
- ధన్యజీవి
- భూతలం
కథలు, వ్యాసములు
[మార్చు]- నిజం
- పాత బియ్యే! కొత్త బియ్యే
- బోధనాపద్ధతులు
- అద్దెకొంపలు
- కాఫీ దేవాలయం
- నామీదేనర్రోయ్ (కథ)
- ధుమాలమ్మ ఓఘాయిత్యం
- అవును
- మేష్టరీకూడా ఒక ఉద్యోగమేనా?
- ఆధ్రా యూనివర్సిటీ పట్టుదలలు
- తమ్ముడి పెళ్ళికి తరలి వెళ్ళడం (కథ)
- విమానం
- పల్లెటూరు పాఠశాల తణిఖీ తంతు (కథ)
వ్యాసములు
[మార్చు]- లోకోభిన్నరుచి: ఈ సంపుటిలో 7 వ్యాసములు ఉన్నాయి
- బస్తీ రోడ్డు
- అయోమార్గం-అభినందనం
- తిండి విశేషాలు
- లోకోభిన్నరుచి:
- స్థాయిమారినా ఓటే పాట!
- రేడియో కబుర్లు 1,2,3
- మన తెలుగు-ఈ సంపుటిలో6 వ్యాసములు ఉన్నాయి
- పరీక్షలు
- "మన" తెలుగు
- దశరూపకం
- శాస్త్రం-కళ
- 'రెండోభాష' మేష్టరు
- గ్రంధప్రచురణ
- తనలో - ఈ సంపుటిలో 9 వ్యాసాలు ఉన్నాయి
- విశ్వామిత్రరావు - తనలో
- చారుదత్తరావు ధోరణి
- తనలో
- నవ్వు
- దీపావళి
- భూతలం
- వైద్యం
- కుబేరరావు - తనలో
- బాలబోధ
- మాటవరస - ఇందులో 19 వ్యాసలున్నాయి
- చుట్టా, బీడీ, సిగరెట్
- శారదా బిల్లు
- వార్తలు
- బలరామయ్యగారి ఇంగ్లీషు తమ్ముడు
- భోజనోపదేశం
- సంగతులు
- విద్యార్థుల ఏకాంతపు రిమార్కులు
- పాలక సంఘాల్లో ఎన్నికల మజా
- సంగతులు
- భూకంపం
- విమానం మీద పన్ను
- బస్తీ - దుమ్ము
- పదిరూపాయల టెక్కెట్టు
- కొత్త వోటు
- కోతులు
- భూమి యుద్ధాలు
- మత్రివర్గం
- రైలు - బస్సు
- తెలుగు ఇడెన్
- మేజువాణి-ఇందులో 6 వ్యాసాలు ఉన్నాయి
- వన్సు మోర్
- నాటకం-టాకీ
- గాన ప్రశంస
- వేషరాగాల మేజువాణి
- తెలుగు నటుడు
- త్యాగరాజు మాటల
- అయోమార్గ విమర్శ
- త్యాగరాజు ఆత్మ విచారం
- పెళ్ళి ట్రైనింగ్,
- అద్దె కొంపలు
- కాలక్షేపం
- అన్నీ తగాదాలే
- అవును
- నిజం
- పద్యం - అర్థం
జీవితచరిత్ర
[మార్చు]చంద్రుడికి.. ఆయన రాసిన జీవితచరిత్ర. తెలుగులో హాస్యరచనలకు ప్రసిద్ధి గాంచిన భమిడిపాటి తన జీవితంలో జరిగిన విశేషాలు, సంఘటనలను ఈ పుస్తకంలో వివరించారు.[3]
మరణం
[మార్చు]ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన వీరు 1958, ఆగష్టు 28 న పరమపదించారు.
మూలాలు
[మార్చు]- ↑ కామేశ్వరరావు, భమిడపాటి. చెప్పలేం!.
- ↑ కామేశ్వరరావు, భమిడిపాటి (1946). అన్నీ తగాదాలే. అద్దేపల్లి అండ్ కో. Retrieved 2020-07-13.
- ↑ కామేశ్వరరావు, భమిడపాటి. చంద్రుడికి.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- భమిడిపాటి వారి రచనల నుండి
భమిడిపాటి రచనా మాలిక
[మార్చు]-
భమిడిపాటి వారి పుస్తకాల మీద ఎక్కువగా ప్రచురించబడిన ముఖ చిత్రం అసలుకు నకలు చిత్రీకరణ 'బాపు'
-
ఇప్పుడు మూడు నాటికల సంపుటి
-
1948లో ప్రచురితమైన "మన తెలుగు" వ్యాస సంపుటి
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలుగు రచయితలు
- 1897 జననాలు
- 1958 మరణాలు
- ఆదర్శ ఉపాధ్యాయులు
- తూర్పు గోదావరి జిల్లా రచయితలు
- పశ్చిమ గోదావరి జిల్లా రచయితలు
- రష్యన్ నుండి తెలుగు లోకి అనువాదాలు చేసిన రచయితలు