Jump to content

భద్రాదేవి

వికీపీడియా నుండి
భద్రాదేవి
మహాభారతం పాత్ర
శ్రీకృష్ణుడి అష్టభార్యలు (19వ శతాబ్దపు మైసూర్ చిత్రపటం)
సమాచారం
దాంపత్యభాగస్వామిశ్రీకృష్ణుడు

భద్రాదేవి భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో[1] ఎనమిదవ భార్య. ఈమె కేకయదేశాధిపతి కుమార్తె, శ్రీకృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణుడు మేనరిక సంబంధం ద్వారా పెళ్ళి చేసుకున్న ఇద్దరు భార్యలలో ఈమె ఒకరు కాగా, మరొకరు మిత్రవింద. భద్రాదేవి, కృష్ణుడికి ఏడవ భార్య (ఎనిమిదవ భార్య కాకుండా) అని కొందరు అభిప్రాయపడుతున్నారు. విష్ణు పురాణం, హరివంశ పురాణంలోని అష్టభార్య జాబితాలో భద్రాకు అస్సలు పేరు పెట్టలేదు, కానీ ఆమెను 'ధ్రిష్టకేతు కుమార్తె' లేదా 'కేకేయ యువరాణి' అని పిలుస్తారు.[2]

జీవిత విషయాలు

[మార్చు]

భాగవత పురాణం ప్రకారం భద్రాదేవిని కైకేయ రాజ్యపు యువరాణి కైకేయి అనే పేరుతో పిలుస్తారు. ఆమె తండ్రి ధృష్టకేతు రాజు, తల్లి శృతకిర్తి. శృతకిర్తి, కుంతి (పాండవుల తల్లి) వసుదేవుడిల (కృష్ణ తండ్రి) సోదరి. భద్రాదేవి ఐదుగురు సోదరులలో పెద్ద యువరాజు సంతార్దాన నేతృత్వంలో భద్రాదేవిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు.[3][4] మరొక కథలో, భద్రాదేవి స్వయంవరం వేడుకలో కృష్ణుడిని తన భర్తగా ఎన్నుకున్నట్లు వివరించబడింది.[5] కుంతి, పాండవులు, ద్రౌపదిని కలవడానికి శ్రీకృష్ణుడు, అతని రాణులు ఒకసారి హస్తినాపూరాన్ని సందర్శించారు. కుంతి చెప్పినట్లుగా భద్రాదేవి, ఇతర రాణులను ద్రౌపది పూజించి, గౌరవిస్తుంది. కృష్ణుడు తనని ఎలా వివాహం చేసుకున్నాడో భద్రాదేవి, ద్రౌపదికి కూడా వివరిస్తుంది.[6] [7] శ్రీకృష్ణుడు, భద్రాదేవికి సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అని 10మంది పిల్లలు పుట్టారు.[8][9] కృష్ణుని అంత్యక్రియలలో రాణుల ఏడుపులును భాగవత పురాణం వివరిస్తోంది.[10] భాగవత పురాణం ప్రకారం రాణులందరూ సతీసహగమనంకి పాల్పడ్డారు, మహాభారతం భద్రాదేవితో సహా నలుగురిని మాత్రమే ప్రస్తావించింది.[11][12]

పుస్తకాలు

[మార్చు]

భద్ర కల్యాణం అనే పుస్తకాన్ని తెలుగులో డాక్టర్ కె. వి. కృష్ణకుమారి రాసింది. ఆమె తన 80 వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి బాబాకు ఈ పుస్తకాన్ని అంకితం చేసింది. ఈ పుస్తకంలో, ఆమె భద్రాదేవిని మహాలక్ష్మి (విష్ణు భార్య) గా, కృష్ణుడితో తన వివాహం తన ఏడవ భార్యగా అభివర్ణించింది.[13] భద్రాదేవికి శ్రీకృష్ణునితో జరిగిన వివాహం గురించిన తెలుగు ప్రబంధం భద్రాపరిణయం లేదా ముకుందవిలాసము. దీనిని కాణాదం పెద్దన 18వ శతాబ్దంలో రచించాడు.

మూలాలు

[మార్చు]
  1. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. p. 62. ISBN 978-0-8426-0822-0.
  2. Horace Hayman Wilson (1870). The Vishńu Puráńa: a system of Hindu mythology and tradition. Trübner. pp. 82–3. Retrieved 16 July 2020.
  3. Prabhupada. "Bhagavata Purana 10.58.56". Bhaktivedanta Book Trust. Archived from the original on 17 అక్టోబరు 2010. Retrieved 16 జూలై 2020.
  4. Prabhupada. "Bhagavata Purana 9.24.38". Bhaktivedanta Book Trust. Archived from the original on 18 సెప్టెంబరు 2009. Retrieved 16 జూలై 2020.
  5. Aparna Chatterjee (December 10, 2007). "The Ashta-Bharyas". American Chronicle. Archived from the original on 6 డిసెంబరు 2012. Retrieved 16 July 2020.
  6. V. R. Ramachandra Dikshitar (1995). The Purana Index. Motilal Banarsidass. p. 534. ISBN 978-81-208-1273-4. Retrieved 16 July 2020.
  7. Prabhupada. "Bhagavata Purana 10.71.41-42". Bhaktivedanta Book Trust. Archived from the original on 2006-09-11. Retrieved 2020-07-16.
  8. "The Genealogical Table of the Family of Krishna". Krsnabook.com. Retrieved 16 July 2020.
  9. Prabhupada. "Bhagavata Purana 10.61.17". Bhaktivedanta Book Trust. Archived from the original on 21 అక్టోబరు 2010. Retrieved 16 జూలై 2020.
  10. Prabhupada. "Bhagavata Purana 11.31.20". Bhaktivedanta Book Trust. Archived from the original on 13 జూన్ 2010. Retrieved 16 జూలై 2020.
  11. Kisari Mohan Ganguli. "Mahabharata". Sacred-texts.com. Retrieved 16 July 2020.
  12. Prabhupada. "Bhagavata Purana 11.31.20". Bhaktivedanta Book Trust. Archived from the original on 13 జూన్ 2010. Retrieved 16 జూలై 2020.
  13. Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari. Archive. org. Retrieved 16 July 2020.