భగీరథ్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భగీరథ్ చౌదరి (జననం 16 జూన్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

భగీరథ్ చౌదరి 1 జూన్ 1954న అజ్మీర్‌లోని మన్పూర్‌లో రామచంద్ర చౌదరి, దఖా దేవి దంపతులకు జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

భగీరథ్ చౌదరి 2003లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2015-16 & 2016 నుండి 2017 వరకు పర్యావరణ కమిటీ ఛైర్మన్‌గా ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికై 17వ లోక్‌సభలో 100 శాతం హాజరును సాధించాడు.[3][4]

భగీరథ్ చౌదరి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కిషన్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ చౌదరి చేతిలో 83645 ఓట్ల మెజారిటీతో ఓడిపోయి డిపాజిట్‌ను కోల్పోయాడు, 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. India Today (9 June 2024). "Bhagirath Choudhary, BJP Ajmer MP, sworn in as Union Minister after massive win" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. EENADU (10 June 2024). "Central Ministers List: మోదీ 3.0 మంత్రిమండలి సమగ్ర స్వరూపం". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. The Economic Times (13 February 2024). "Two BJP members clock 100% attendance in outgoing LS". Retrieved 10 June 2024.
  4. The Hans India (14 February 2024). "Two BJP MPs clock 100% attendance in outgoing LS" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. EENADU (10 June 2024). "New Cabinet: కేబినెట్‌లో పాతకొత్తల మేలు కలయిక". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.