Jump to content

భక్త మార్కండేయ (1956 సినిమా)

వికీపీడియా నుండి
(భక్త మార్కండేయ నుండి దారిమార్పు చెందింది)
భక్త మార్కండేయ
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.రంగా
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
ఆర్.నాగేంద్రరావు,
నాగయ్య,
పుష్పవల్లి,
రఘురామయ్య,
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి,
రమణారెడ్డి,
వంగర,
సదాశివయ్య,
మహంకాళి వెంకయ్య,
శ్రీనివాసరావు,
ప్రసాదరావు,
మాస్టర్ ప్రభాకర్,
సురభి బాలసరస్వతి,
పద్మిని ప్రియదర్శిని,
సూర్యకళ,
లక్ష్మీకాంత
సంగీతం విశ్వనాథన్ - రామమూర్తి
నేపథ్య గానం పి.లీల,
పి.సుశీల,
ఆర్.బాలసరస్వతి,
సూలమంగళం రాజలక్ష్మి,
ఏ.పి.కోమల,
జమునారాణి,
సత్యవతి,
పెండ్యాల నాగేశ్వరరావు,
శ్రీనివాసాచారి,
మాధవపెద్ది సత్యం
నృత్యాలు చోప్రా
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం బి.ఎన్.హరి
కళ వాలి
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భక్త మార్కండేయ (Bhakta Markandeya) 1956లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విక్రం ప్రొడక్షన్స్ అధినేత బి.ఎస్.రంగా స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ చిత్రంలో నాగయ్య, కల్యాణం రఘురామయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు, పుష్పవల్లి,కాంతారావు మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్, రామమూర్తి అందించారు.

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

నిర్మాత , దర్శకుడు: బి.ఎస్.రంగా

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్,రామమూర్తి

గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య

మాటలు:సముద్రాల రాఘవాచార్య

గాయనీ గాయకులు: కల్యాణం రఘురామయ్య, రావు బాలసరస్వతి దేవి, పిఠాపురం నాగేశ్వరరావు, సత్యవతి, పి లీల, ఎ.పి.కోమల, కె.జమునారాణి , ఎ.ఎం.రాజా, నాగయ్య, శూలమంగళం రాజ్యలక్ష్మి, పులపాక సుశీల, చిలకలపూడి సీతారామాంజనేయులు, ప్రతివాది భయంకర శ్రీనివాస్

నిర్మాణ సంస్థ: విక్రమ్ ప్రొడక్షన్స్

నృత్యాలు: చోప్రా

ఛాయా గ్రహణం: హరి

కళ: వాలి

విడుదల:28:12:1956.

పాటల జాబితా

[మార్చు]

గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య

1.అంతా శివమయమన్నా జగమంతా శివమయమన్నా, గానం: పిఠాపురం నాగేశ్వరరావు బృందం

2.అవునంటారా కాదంటారా ఇంటికి అందం ఇల్లాలే, గానం: సత్యవతి, పిఠాపురం నాగేశ్వరరావు

3.ఆడేది పాడేది వాడవాడ తిరిగేది అడిగినోడి చెయ్యి చూసి, గానం: ఎ.పి.కోమల

4 ఊగు ఊగు ఉయ్యాలా ఊగు హాయిగా జంపాల చిన్నారి, గానం: పి.లీల బృందం

5.కన్నేలేడి కళ్లదానా మల్లెమొగ్గ పళ్ళదానా నన్నెలుకోీవే, గానం: పిపిఠాపురం , కె.జమునారాణి

6 కొండలు కోనలు దాటుచును వెనుకాడక సాగేను, గానం.ఎ.ఎం.రాజా, ఎ.పి.కోమల బృందం

7.జయ జయ శ్రీమన్ మహాదేవా(దండకం)

8.జయ జయ శంకరా సాంబశివ సదాశివ శంభో మహేశా, గానం.నాగయ్య, శూలమంగళం రాజ్యలక్ష్మి

9.జయ జయ సర్వేశా నిన్ను మదిని భజించిన సాటిలేని, గానం: కె.జమునారాణి

10.తెరచి చూడయ్యా కన్ను తెరచి చూడయ్యా, గానం.పులపాక సుశీల బృందం

11.దేవాదిదేవా శ్రీకర శుభకర దేవాదిదేవా గోవింద ఆనంద, గానం: కల్యాణం రఘురామయ్య

12.దాగుడుమూతలు నాతోనా నను దయగనరా ఇకనైనా, గానం: రావు బాలసరస్వతి దేవి

13.ధనము వలనను ధర్మంబు దానం వలన(పద్యం) గానం: చిలకలపూడి సీతారామాంజనేయులు

14.భక్తలోక శుభంకరు పరమశివుని కైవశము చేయు(పద్యం) గానం.కల్యాణం రఘురామయ్య

15.నందనులతోడ కలసి ఆనందమొందు ఆదిదంపతుల(పద్యం), గానం.కల్యాణం రఘురామయ్య

16.నిను సేవింపగా గోరిన కనిపెంచిన తల్లి(పద్యం), గానం.పులపాక సుశీల

17.పావనమ్మగు తిరువారూరుపురమున రంగరు సైకతలింగం(పద్యం), గానం.కళ్యాణం.రఘురామయ్య

18.ప్రేమాకృతివో అమ్మా చిననాడే శివుని కోరి ఘన తపము, గానం.పి.బి.శ్రీనివాస్ , పి సుశీల బృందం

19.మార్కండేయ జననంబదిన నాడే వ్రాసేనొసటన్(పద్యం), గానం.శూలమంగలం రాజ్యలక్ష్మి

20.మోహన సుందర ఉూరగా భరణా.,. శివనామ భవతారణా, గానం.కల్యాణం రఘురామయ్య

21.శంకర గళహరా సంకట పరిహారా, గానం.నాగయ్య, శూలమంగలం రాజ్యలక్ష్మి బృందం

22.శివనామా భవతరణా భవతరణా శివ తవచరణా, గానం.కల్యాణం రఘురామయ్య

23.సకల చరాచర జీవుల హృదయాల వెలసి వెలంగేదేవా, గానం.శూలమంగళం రాజ్యలక్ష్మి

24.ధర్మాంధ దుశీళ్ళ దుర్భతీ ధర్మునే(సంవాద పద్యాలు),

,

మూలాలు

[మార్చు]