బ్వేనౌస్ ఐరిస్
స్వరూపం
బ్వేనౌస్ ఐరిస్ లేదా బ్వేనోస్ ఐరిస్ అర్జెంటీనా దేశపు రాజధాని, అతిపెద్ద పట్టణం. ఇది దక్షిణ అమెరికాలో ఆగ్నేయ దిశలో ఉన్న రియో డి లా ప్లాటా నదికి పశ్చిమ తీరాన విస్తరించి ఉంది.
ఈ నగరం 2018లో అత్యుత్తమ జీవన ప్రమాణాల్లో ప్రపంచంలో 91వ స్థానంలో, లాటిన్ అమెరికాలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలిచింది.[1][2] 2012 లో ఈ నగరం దక్షిణ అమెరికాలో అత్యధిక పర్యాటకులు సందర్శించిన నగరంగానూ, లాటిన్ అమెరికాలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన రెండవ నగరంగానూ నిలిచింది.[3]
ఈ నగరం ఎక్లెక్టిక్ యూరోపియన్ నిర్మాణశైలిని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న సాంస్కృతిక నగరంగా పేరుగాంచింది.[4][5]
ఇది బహుళ సంస్కృతులకు, వివిధ జాతులకు, మతాలకు నిలయమైన నగరం. స్పానిష్ భాష కాకుండా ఇంకా అనేక భాషలు ఇక్కడ మాట్లాడతారు.
మూలాలు
[మార్చు]- ↑ "Vienna tops Mercer's 20th Quality of Living ranking". Mercer. Archived from the original on 16 April 2018. Retrieved 15 April 2018.
- ↑ "2018 Quality of Living City Rankings". Mercer. Archived from the original on 18 April 2018. Retrieved 15 April 2018.
- ↑ "México DF, Buenos Aires y San Pablo, los destinos turísticos favoritos". Infobae (in స్పానిష్). Archived from the original on 10 October 2014. Retrieved 18 January 2015.
- ↑ "Introduction to architecture in Buenos Aires". Lonely Planet. 14 June 2011. Archived from the original on 18 January 2015. Retrieved 18 January 2015.
- ↑ "Buenos Aires History and Culture". Adventure Life. Archived from the original on 16 September 2012. Retrieved 28 May 2012.