Jump to content

బ్లూస్టాక్స్

వికీపీడియా నుండి


BlueStacks
పరిశ్రమVirtualization, Mobile Software
స్థాపనస్థాపన
స్థాపకుడుRosen Sharma, Jay Vaishnav, Suman Saraf
ప్రధాన కార్యాలయం
Campbell, California,
United States
ఉత్పత్తులుApp Player, GamePop
BlueStacks App Player
దస్త్రం:Latest version of Blustack player as of September.jpg
Latest version of BlueStacks App player
ఆపరేటింగ్ సిస్టంWindows XP or later; Mac OS X Mavericks or later
ప్లాట్ ఫాంx86, x64
ఫైల్ పరిమాణం294MB
అందుబాటులో ఉంది16 భాషలు
రకంVirtual machine, Android emulator
లైసెన్సుFreeware
జాలస్థలిwww.bluestacks.com Edit this on Wikidata

బ్లూస్టాక్స్ అనేది బ్లూస్టాక్స్ యాప్ ప్లేయర్, ఇతర క్లౌడ్ ఆధారిత క్రాస్ ప్లాట్ఫామ్‌ ఉత్పత్తులు ఉత్పత్తి చేసే ఒక అమెరికన్ టెక్ సంస్థ. బ్లూస్టాక్స్ యాప్ ప్లేయర్ అనేది విండోస్ పిసిలలో, మెకింటోష్ కంప్యూటర్లలో ఆండ్రాయిడ్ అప్లికేషన్లను చేతనం చేయుటకు రూపొందించబడింది. ఈ కంపెనీ జే వైష్ణవ్, సుమన్ సరాఫ్, రోసెన్ శర్మ (మెకాఫీ లోని పూర్వ సిటిఒ, క్లౌడ్.కామ్ యొక్క బోర్డు సభ్యుడు) లచే 2009 లో స్థాపించబడింది. ఇందులో పెట్టుబడిదారులుగా ఆండ్రీసెన్-హోరోవిట్జ్, రెడ్‌పాయింట్, శాంసంగ్, ఇంటెల్, క్వాల్కామ్‌, సిట్రిక్స్, రాడార్ పార్టనర్స్, ఇగ్నిషన్ పార్టనర్స్, AMD, ఇతరులు ఉన్నారు.[1] బ్లూస్టాక్స్ శర్మ యొక్క 8వ సంస్థ (శర్మ కంపెనీల యొక్క ఐదు గూగుల్, మైక్రోసాఫ్ట్, సిట్రిక్స్ ఎక్స్ 2, మెకాఫీ చే కొనుగోలుచేయ్యబడినాయి). బ్లూస్టాక్స్ బీటా వెర్షన్ 2014 జూన్ 7 న సవరించబడింది.

బ్లూస్టాక్స్ ను కంప్యూటరులో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వాట్స్‌యాప్ వంటి ఆండ్రాయిడ్ యాప్ లను ఉపయోగించుకోవచ్చు. ఈ బ్లూస్టాక్స్ యాప్ ప్లేయర్ ను నెట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించే పద్ధతిలో కొన్ని అదనపు సౌకర్యాలు లభిస్తాయి.

యాప్ ప్లేయర్

[మార్చు]

ఈ కంపెనీ అధికారికంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని సిట్రిక్స్ సినర్జీ సమావేశంలో 2011 మే 25 న ప్రారంభించబడింది. సిట్రిక్స్ CEO మార్క్ టెంపుల్టన్ వేదికపై బ్లూస్టాక్స్ యొక్క ఒక ప్రారంభ వెర్షన్ను ప్రదర్శించాడు, సంస్థలో ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు ప్రకటించాడు. యాప్ ప్లేయర్ యొక్క పబ్లిక్ ఆల్ఫా వెర్షన్ 2011 అక్టోబరు 11 న ప్రారంభించబడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Etherington, Darrell. "After 10M Downloads, Samsung Backs GamePop As BlueStacks Adds $13M In New Funding". TechCrunch. Retrieved 23 July 2014.
  2. Empson, Rip. "BlueStacks Releases App Player And Cloud Connect Service To Let You Run Android Apps On Your PC". TechCrunch. Retrieved 4 December 2011.