బ్లాగు పుస్తకం
స్వరూపం
బ్లాగు పుస్తకం అనేది తెలుగులో బ్లాగులపై విడుదలైన మొదటి పుస్తకం. ఈ పుస్తకాన్ని తెలుగు బ్లాగరులైన సుజాత, రహ్మానుద్దీన్ లు వ్రాసారు. కంప్యూటరులో తెలుగులో టైపింగు చేయడం నుండి స్వంతంగా బ్లాగు రూపొందించి ఎలా నిర్వహించుకోవచ్చో ఈ పుస్తకంలో సవివరంగా వ్రాసారు. ప్రతీ అంశాన్నీ చక్కగా తెరపట్టులతో అంచెలవారీగా వివరించారు. బ్లాగులు సృష్టించడం, వాడటం మాత్రమే కాకుండా బ్లాగుల వలన కలిగే లాభనష్టాలు, అగ్రిగేటర్లు గురించి కూడా వ్రాసారు.
18 అధ్యాయాలుగా విస్తరించిన 108 పేజీల ఈ చిన్న పుస్తకం ఔత్సాహికులకు కరదీపికగా ఉపయోగపడేలా ఉంది. సాంకేతిక అంశాలను స్క్రీన్ షాట్ల సాయంతో శ్రద్ధగా వివరించటం జరిగింది. బ్లాగింగులో విధి నిషేధాలు కూడా చెప్పటం వల్ల అదనంగా విలువ సమకూరింది.