Jump to content

బ్రైడన్ కార్స్

వికీపీడియా నుండి
బ్రైడన్ కార్స్
2023 లో కార్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రైడన్ అలెగ్జాండర్ కార్స్
పుట్టిన తేదీ (1995-07-31) 1995 జూలై 31 (వయసు 29)
కేప్ టౌన్, వెస్టర్న్ కేప్, దక్షిణాఫ్రికా
ఎత్తు6 అ. 3 అం. (1.91 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
బంధువులుJames Carse (father)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 259)2021 జూలై 8 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2022 జూలై 19 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 100)2023 ఆగస్టు 30 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014/15ఈస్టర్న్ ప్రావిన్స్
2016–presentడర్హమ్‌ (స్క్వాడ్ నం. 99)
2021–presentNorthern Superchargers
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 9 2 41 18
చేసిన పరుగులు 77 1,274 96
బ్యాటింగు సగటు 19.25 31.85 13.71
100లు/50లు 0/0 –/– 1/5 0/0
అత్యుత్తమ స్కోరు 31 108* 31
వేసిన బంతులు 406 36 5,546 717
వికెట్లు 12 4 116 22
బౌలింగు సగటు 31.83 9.75 30.81 30.90
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 5 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/61 3/23 6/26 5/61
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 8/– 3/–
మూలం: Cricinfo, 2 September 2023

బ్రైడాన్ అలెగ్జాండర్ కార్స్ (జననం 1995 జూలై 31) దక్షిణాఫ్రికాలో జన్మించిన ఇంగ్లాండ్ క్రికెటరు. అతను డర్హామ్ కౌంటీ క్రికెట్ క్లబ్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు. ప్రధానంగా కుడిచేతి ఫాస్ట్ బౌలరు, కుడిచేతి వాటం బ్యాటరు. అతను నార్తాంప్టన్‌షైర్ తరపున ఇంగ్లాండ్‌లో ఆడిన జింబాబ్వే క్రికెటర్ జేమ్స్ అలెగ్జాండర్ కార్స్ కుమారుడు. బ్రైడన్ కార్స్ మంచి వేగంతో బౌలింగు చేస్తాడు. క్రమం తప్పకుండా 145కిమీ/గం వేగంతో వేస్తాడు. [1] అతను 2021 జూలైలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు.

దేశీయ కెరీర్

[మార్చు]

కార్స్ 2016లో డర్హామ్‌తో డెవలప్‌మెంట్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసాడు. అతను అదే సంవత్సరం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [2] తన తొలి సీజన్‌లో 17 వికెట్లు తీసి, క్లబ్ నుండి రెండు సంవత్సరాల ఒప్పందాన్ని బహుమతిగా పొందాడు. [3] మోకాలి గాయం కారణంగా అతను 2018 కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. [4] 2018 సెప్టెంబరులో, డర్హామ్ అతనికి మూడేళ్ల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది.

2019 రాయల్ లండన్ వన్-డే కప్‌లో డర్హామ్ తరపున కార్స్ 2019 ఏప్రిల్ 17 న తన లిస్ట్ A రంగప్రవేశం చేశాడు. [5] 2022 ఏప్రిల్‌లో ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అతన్ని కొనుగోలు చేసింది. [6]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

కార్స్ తన పూర్వీకులు బ్రిటీషర్లైన కారణంగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు అర్హత పొందాడు. 2019లో అతని ఇంగ్లాండ్ రెసిడెన్సీ అర్హతను పూర్తి చేశాడు. 2021 జులైలో పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం ఇంగ్లాండ్ వన్‌డే జట్టులో అతను ఎంపికైనప్పటికీ,[7] కోవిడ్-19 పాజిటివు అవడాన పర్యటన నుండి ఉపసంహరించుకున్నాడు.[8] కార్స్ తన వన్‌డే రంగప్రవేశం 2021 జూలై 8 నపాకిస్తాన్‌పై ఆడాడు. [9] 2021 జూలై 13 న పాకిస్తాన్‌తో జరిగిన మూడవ వన్‌డేలో కార్స్, వన్‌డేలలో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [10] [11] [12] 2022 మేలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొన్న 14 మంది వన్‌డే జట్టులో కార్స్‌ని చేర్చారు. 2వ వన్‌డేలో కార్స్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతని వేగం 148 కిమీ/గం

అతను 2023 ఆగస్టు 30 న న్యూజిలాండ్‌పై తన T20 రంగప్రవేశం చేసాడు. గాయపడిన జోష్ టంగ్‌కి ప్రత్యామ్నాయంగా ఆడుతూ, 3-23తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ని గెలుచుకున్నాడు. [13]

మూలాలు

[మార్చు]
  1. "Brydon Carse profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 8 July 2021.
  2. Rayner, Stuart (2016-04-04). "Brydon Carse handed First-Class debut, but he will still have to fight for County Championship spot". ChronicleLive (in ఇంగ్లీష్). Retrieved 2021-07-08.
  3. "Who Is Brydon Carse? | England Lions | Wisden Cricket". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-02-25. Archived from the original on 2021-07-09. Retrieved 2021-07-08.
  4. "Brydon Carse delighted by County Championship return | The Cricketer". www.thecricketer.com. Retrieved 2021-07-08.
  5. "North Group, One-Day Cup at Chester-le-Street, Apr 17 2019". ESPN Cricinfo. Retrieved 17 April 2019.
  6. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  7. "England Men announce new squad for Royal London Series against Pakistan". England and Wales Cricket Board. Retrieved 6 July 2021.
  8. "Ben Stokes to captain England against Pakistan after seven members in bio-bubble test positive for COVID-19". International Cricket Council. Retrieved 6 July 2021.
  9. "1st ODI (D/N), Cardiff, Jul 8 2021, Pakistan tour of England". ESPN Cricinfo. Retrieved 8 July 2021.
  10. "James Vince hits maiden England hundred to lead them to ODI series sweep over Pakistan". Sky Sports. Retrieved 13 July 2021.
  11. "England pull off record run-chase as James Vince comes of age". www.telegraph.co.uk. Retrieved 2021-07-14.
  12. "James Vince trumps Babar Azam's 158 as England seal stunning 332 chase". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
  13. https://www.espncricinfo.com/series/new-zealand-in-england-2023-1336039/england-vs-new-zealand-1st-t20i-1336048/match-report