బ్రీఫ్ ఎన్‌కౌంటర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రీఫ్ ఎన్‌కౌంటర్
దర్శకత్వండేవిడ్ లీన్
రచననోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, డేవిడ్ లీన్, రోనాల్డ్ నీమే
నిర్మాతనోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, రోనాల్డ్ నీమే
తారాగణంసెలియా జాన్సన్, ట్రెవర్ హోవార్డ్, స్టాన్లీ హోల్లోవే, జాయిస్ కారే, సిరిల్ రేమండ్, ఎవర్లీ గ్రెగ్, మార్గరెట్ బార్టన్
ఛాయాగ్రహణంరాబర్ట్ క్రాస్కర్
కూర్పుజాక్ హారిస్
సంగీతంసెర్గీ రాచ్మనినోఫ్
పంపిణీదార్లుఈగిల్-లయన్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీs
13 నవంబర్ 1945 (ప్రీమియర్, లండన్), 26 నవంబర్ 1945 (యునైటెడ్ కింగ్‌డమ్)
సినిమా నిడివి
86 నిముషాలు[1]
దేశంయునైటెడ్ కింగ్‌డమ్
భాషఇంగ్లీష్
బడ్జెట్$1 మిలియన్[2]

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ 1945లో డేవిడ్ లీన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. నోయెల్ కవర్డ్ 1936లో రాసిన స్టిల్ లైఫ్ నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సెలియా జాన్సన్, ట్రెవర్ హోవార్డ్, స్టాన్లీ హోల్లోవే, జాయిస్ కారే, సిరిల్ రేమండ్, ఎవర్లీ గ్రెగ్, మార్గరెట్ బార్టన్ తదితరులు నటించారు.

లారా సాంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ. వివాహమై ఇద్దరు పిల్లలున్న లారాకు అపరిచిత వ్యక్తైన అలెక్ తో రైల్వే స్టేషన్ లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఆ తరువాత వాళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది మిగిలిన కథ.

నటవర్గం

[మార్చు]
  • సెలియా జాన్సన్
  • ట్రెవర్ హోవార్డ్
  • స్టాన్లీ హోల్లోవే
  • జాయిస్ కారే
  • సిరిల్ రేమండ్
  • ఎవర్లీ గ్రెగ్
  • మార్గరెట్ బార్టన్
  • మార్జోరీ మార్స్
  • అల్ఫీ బాస్
  • వాలెస్ బోస్కో
  • సిడ్నీ బ్రోమ్లే
  • వాలెంటైన్ డైయల్
  • ఐరీన్ హ్యాండ్ల్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం:డేవిడ్ లీన్
  • నిర్మాత: నోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, రోనాల్డ్ నీమే
  • రచన: నోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, డేవిడ్ లీన్, రోనాల్డ్ నీమే
  • ఆధారం: నోయెల్ కవర్డ్ 1936లో రాసిన స్టిల్ లైఫ్ నాటకం
  • సంగీతం: సెర్గీ రాచ్మనినోఫ్
  • ఛాయాగ్రహణం: రాబర్ట్ క్రాస్కర్
  • కూర్పు: జాక్ హారిస్
  • పంపిణీదారు: ఈగల్-లయన్ డిస్ట్రిబ్యూటర్స్

ఇతర వివరాలు

[మార్చు]
  1. 1999లో ఈ చిత్రం బ్రిటీష్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారిచే రెండవ అత్యుత్తమ బ్రిటీష్ చిత్రంగా ఎన్నుకోబడింది.
  2. 2017లో టైమ్ ఔట్ మ్యాగజైన్ కోసం 150 నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, విమర్శకులచే పన్నెండవ ఉత్తమ బ్రిటీష్ చిత్రంగా నిలిచింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "BRIEF ENCOUNTER". British Board of Film Classification. Archived from the original on 2017-08-27. Retrieved 2019-01-20. Retrieved 20 January 2019
  2. "US Life or Death to Brit Pix", Variety 25 Dec 1946 p 9
  3. "The 100 best British films". Time Out. Retrieved 20 January 2019

ఇతర లంకెలు

[మార్చు]