బ్రాయిలర్ కోళ్ళ పెంపకం
స్వరూపం
కోడి మాంసం పరిశ్రమలో బ్రాయిలర్ కోళ్ళకు ప్రత్యేకమైన స్ధానముంది. బ్రాయిలర్లను వుత్పత్తి చేసే రైతులు పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టు పద్ధతి మీద సరఫరా చేస్తూ ఉంటారు. అందుచేత కోళ్ళ రైతులకు మార్కెటింగ్ సమస్య కాబోదు. బ్రాయిలర్ అంటే ఎనిమిది వారాల చిన్న కోడిపిల్ల/అరకోడి. లేత మాంసం మెత్తగా ఉండి ఒకటిన్నర నుండి రెండు కి.గ్రా. బరువు ఉంటుంది. [1]
శ్రేష్టమైన పెంపక విధానం
- కోళ్ళఫారం ఉష్ణోగ్రత - మొదటి వారంలో 95 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటే బాగుంటుంది. తరువాత వారానికి 5 డిగ్రీ ఫా. చొప్పున తగ్గుతూ, ఆరు వారాల వయస్సు వచ్చేసరికి 70 డిగ్రీల ఫా.దగ్గర ఉంచాలి.
- గాలి - మంచి గాలి తగిలేటట్టు చూడాలి. ఎప్పటికప్పుడు కోడి రెట్టల్ని (అమ్మోనియా) తొలగిస్తూ ఉండాలి. లేకపోతే కోళ్ళు ఉక్కిరిబిక్కిరికి లోనవుతూ ఉంటాయి.
- వెలుతురు - ప్రతి 200 చ. అ నేలకు ఒక 60 వాట్ల బల్బు అమర్చాలి.
- ముక్కు కత్తిరించడం - కోడికి ఒకరోజప్పుడే ముక్కును కత్తిరించాలి.
- కోడికి కావలసిన ప్రదేశం - ఒక కోడికి ఒక చ. అడుగు
బ్రాయిలర్ ఆరోగ్య రక్షణ
- రోగాలు లేని కోడిపిల్లలతోనే ప్రారంభించాలి.
- మారెక్ వ్యాధి సోకకుండా హేచరీలోనే టీకా వేయించాలి.
- 4 నుండి 5 రోజులప్పుడు ఆర్.డి.వి.ఎఫ్.ఐ మందు వేయాలి.
- కోక్సిడి యూసిస్ రాకుండ మేతలోనే మందులు కలపాలి.
- అప్లోటాక్సిన్ బారినపడకుండా మేతను కాపాడాలి.
- కోళ్ళ పెంటను తీసి వేసి నేలను 3 అంగుళాల లోతు ఉండేలాగ నీటితో కప్పాలి.
మార్కెటింగ్
- కోడిపిల్లను 6 నుండి 8 వారాల వయస్సులో అమ్మవచ్చు.
- కోడిపిల్లలను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దెబ్బలు తగలకుండా మేత, నీరు తొలగించాలి.
- వాతావరణం బాగాలేనప్పుడు, కోడిపిల్లల్ని రవాణా చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
ప్రవేటు కంపెనీలు
- సుగుణ(కోయంబత్తూరు),
- వెంకటేశ్వర హేచరీస్ లిమిటెడ్ (వి.హెచ్.ఎల్-పూణె),
- పయనీర్,
- బ్రోమార్క్
మెదలగు ప్రవేటు కంపెనీలు కోళ్ళ రైతులతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాయి.
ఈ క్రింది వివరాల కోసం దగ్గరలోని వెటర్నరీ క్లీనిక్స్ లేదా అగ్రికల్చర్/వెటర్నరీ సైన్స్ వారిని సంప్రదించండి.
- మంచి జాతి కోళ్ళ రకాలు
- కోళ్ళ షెడ్ ల తయారి
- కోళ్ళ మేత
- ఆరోగ్యమైన కోళ్ళ ఉత్పత్తి