Jump to content

బోలిచేతో ఫౌండేషన్

వికీపీడియా నుండి
బోలిచేతో ఫౌండేషన్
వ్యవస్థాపకులునేతి సాయికిరణ్
కార్యస్థానం
  • నారాయణ్ ఖేడ్, తెలంగాణ, భారతదేశం.
సేవా ప్రాంతాలుతెలంగాణ, అస్సాం, మహారాష్ట్ర
అధికారిక భాషతెలుగు, గోండి, కొలామి, అస్సామీ, రభా, మరాఠి
సిబ్బంది3
కార్యకర్తలు2
జాలగూడుhttps://www.bolicheto.org/

బోలిచేతో ఫౌండేషన్ అనేది భారతదేశంలో భాషల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భవిష్యత్తు తరాల కోసం భాషలు, వివిధ సంస్కృతులు భద్రపరచబడాలని విశ్వసిస్తుంది. సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి జీవనోపాధి అవకాశాలను సృష్టించటం ద్వారా గ్రామీణ వర్గాల ప్రజలను శక్తివంతం చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.[1]

లక్ష్యం

[మార్చు]

ఇంటర్నెట్, డిజిటల్ మాధ్యమాలు, ఓపెన్ నాలెడ్జ్ ద్వారా దేశీయ భాషలు, సంస్కృతిని ప్రోత్సహించడం, పునరుద్ధరించడం అనేవి ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.[2]

స్థాపన

[మార్చు]

ఈ సంస్థను భారతదేశ 9వ మాజీ ప్రధాన మంత్రి అయిన పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా 2023 జూన్ 28 నాడు నేతి సాయికిరణ్ స్థాపించాడు. ప్రస్తుతం ఇందులో ఆత్రం మోతిరాం, సిడాం కిరణ్ లు సభ్యులుగా ఉన్నారు.

ప్రధాన కార్యాలయం

[మార్చు]

ఈ సంస్థ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో గల సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో ఉంది.

భాషలు

[మార్చు]

ప్రస్తుతం ఈ సంస్థ తెలుగు, గోండి, కొలామి[3], అస్సామి, రభా, మరాఠీ అనే ఆరు భారతీయ భాషల్లో పని చేస్తుంది. ఇది వికీపీడియా, వికీసోర్స్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఓపెన్ నాలెడ్జ్ లో ఉనికిని పెంపొందిస్తూ వికీమీడియా కామన్స్ లో దేశీయ భారతీయ కమ్యూనిటీల సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన కంటెంట్ ను మెరుగుపరుస్తుంది.[4][5]

ప్రస్తుత కృషి

[మార్చు]

గ్రామ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా భారతీయ భాషలకు సాంకేతికతను అందించడంలో బోలిచేతో కృషి చేస్తుంది. ప్రస్తుతం ఇది వికీపీడియా ఇంక్యుబెటర్ ద్వారా రెండు ద్రావిడ భాషలైన గోండి, కొలామి భాషల కోసం వికీపీడియా వెర్షన్లను రూపొందిస్తుంది. బోలిచేతో ఒక ఫ్లాట్ షిప్ వాలంటరీ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించింది. దీనిలో ఆరు భారతీయ భాషల నుండి 50 మంది వ్యక్తులకు ఓపెన్ నాలెడ్జ్, వికీపీడియా ప్రాజెక్టులపై శిక్షణ కూడా అందిస్తుంది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "bolicheto.org". www.bolicheto.org. Retrieved 2024-12-07.
  2. Eenadu daily news paper, Cultural development by boli cheto foundation, retrieved 2024-12-14
  3. eenadu, Protection for Kolam language, retrieved 2024-12-14
  4. "కొలాం భాష సంస్కృతికి కృషి చేస్తున్న సంస్థ బోలిచేతో". web.archive.org. Archived from the original on 2023-08-27. Retrieved 2023-08-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. eenaadu, protect our culture, retrieved 2024-12-14
  6. sakshi, develop kolam language, retrieved 2024-12-14
  7. Andhra jyothi, Gondi Wiktionary inauguration day, retrieved 2024-12-14