Jump to content

బోన్ చర్చి

అక్షాంశ రేఖాంశాలు: 49°57′43″N 15°17′18″E / 49.96194°N 15.28833°E / 49.96194; 15.28833
వికీపీడియా నుండి

49°57′43″N 15°17′18″E / 49.96194°N 15.28833°E / 49.96194; 15.28833

బోన్ చర్చి అనేది రోమన్ కాథలిక్ చర్చి. దీని అసలు పేరు సెడ్లెక్ ఒస్సూరీ. దీనిని బోన్ చర్చి లేదా చర్చ్ ఆఫ్ బోన్స్ అని పిలుస్తారు. ఇది చెక్ రిపబ్లిక్‌లోని బోహెమియా ప్రాంతంలోని కుత్నా హోరా పట్టణానికి సమీపంలో ఉన్నసెడ్లెక్ గ్రామంలో ఉంది. ఇక్కడ దాదాపుగా 40,000 నుండి 70,000 మంది అస్థిపంజరాలు ఉన్నాయి. ఇక్కడ చర్చి అలంకరణ కోసం అస్థిపంజరాల ఎముకలను వాడతారు. చెక్ రిపబ్లిక్ లో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి[1]. ఈ చర్చి అలంకరణను చూడటానికి ప్రతి సంవత్సరం 200,000 కంటే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. ఇది 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది[2]. చర్చి లోపలి భాగంలో గంట ఆకారంలో వేలాడే ఎముకల శాండిలియర్ లైట్లు, పుర్రెల దండలు కనిపిస్తాయి. ఎముకలతో రాసిన ఫ్రాంక్ రింట్ సంతకం కూడ ఉంటుంది[3].

ఎముకలతో అలంకరించబడిన చర్చి లోపలి భాగం

చరిత్ర

[మార్చు]

1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్ మఠానికి మఠాధిపతి అయిన హెన్రీని బోహేమియా రాజు ఒటాకర్ II గోల్గోతాకు పంపాడు. అక్కడి నుండి కొద్దిపాటి మట్టి తీసుక వచ్చి అబ్బే స్మశానవాటికపై చల్లాడు. ఆ తరువాత అది పవిత్ర స్థలంగా మారడంతో అక్కడి వారు చనిపోయిన వారిని అక్కడే ఖననం చేసేవారు. 14వ శతాబ్దంలో యూరప్ అంతటా ప్లేగు వ్యాధి, మతపరమైన యుద్ధాలతో దాదాపుగా 30వేల మంది చనిపోవడంతో స్మశానవాటిక విస్తరించబడింది. 1870లో అక్కడ చర్చిని నిర్మించడం ప్రారంభించడంతో పాతిపెట్టిన శవాలను తవ్వి వాటి ఎముకలను నిల్వ చేయడం కోసం వాటిని ఆ చర్చికి అలంకరణగా ఉపయోగించారు.

ఇతర విషయాలు

[మార్చు]
  • లాంగ్ వే రౌండ్ డాక్యుమెంటరీ
  • డన్జియన్స్ & డ్రాగన్స్[4]
  • బ్లడ్ & చాక్లెట్
  • రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌
  • అడాప్టేషన్
  • హౌస్ ఆఫ్ 1000 కార్ప్స్‌
  • ది అమేజింగ్ రేస్: ది అమేజింగ్ రేస్ ఆస్ట్రేలియా 1 వంటి చిత్రాలలో ఈ చర్చిని చూపించారు.
  • ప్రోగ్రెసివ్ బ్లాక్ మెటల్ వంటి ఆల్బంకి కవర్ ఆర్ట్ గా ఈ చర్చి చిత్రాన్ని వాడారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sakshi Telugu Daily Funday dated Sun, 24 Jul 22". epaper.sakshi.com. Retrieved 2022-07-30.[permanent dead link]
  2. Centre, UNESCO World Heritage. "Kutná Hora: Historical Town Centre with the Church of St Barbara and the Cathedral of Our Lady at Sedlec". UNESCO World Heritage Centre. Retrieved 2022-07-30.
  3. Bicknell, Jeanette; Judkins, Jennifer; Korsmeyer, Carolyn (2019-07-15). Philosophical Perspectives on Ruins, Monuments, and Memorials. Routledge. ISBN 978-1-351-38063-8.
  4. "Czech filming locations and movies filmed in the Czech Republic". www.myczechrepublic.com. Archived from the original on 2016-01-22. Retrieved 2022-07-30.