బోడ జనార్థన్
బోడ జనార్దన్ | |||
| |||
పదవీ కాలం 1985 – 2004 | |||
ముందు | ఎస్. సంజీవ రావు | ||
---|---|---|---|
తరువాత | జి. వినోద్ | ||
నియోజకవర్గం | చెన్నూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1959 | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
నివాసం | మందమర్రి, ఆదిలాబాద్, తెలంగాణ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బోడ జనార్థన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి . ఆయన నాలుగుసార్లు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]బోడ జనార్థన్ 1959లో తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్, మందమర్రిలో జన్మించాడు. ఆయన 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు మందమర్రి జిల్లా పరిషత్ పాఠశాలలో, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేశాడు. ఆయన మంచిర్యాల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్కోకి వచ్చి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోదాటి దేవకి దేవిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోదాటి ప్రదీప్‌పై గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు.[2]
బోడ జనార్థన్ 1994 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరావుపై, 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వినోద్ పై ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వినోద్ చేతిలో ఓటమి పాలయ్యాడు.ఆయన 2011లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ మంచిర్యాల జిల్లా (తూర్పు) అధ్యక్షునిగా పనిచేశాడు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తిరిగి టీడీపీలో చేరాడు.
బోడ జనార్థన్ 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] ఆయనకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. ఆయన 2019 జూన్లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Andhrajyothy (29 June 2021). "కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Hindustan Times (28 June 2019). "2 Cong, 3 TDP leaders from Telangana join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
- ↑ TV9 Telugu (27 June 2019). "టీడీపీ, కాంగ్రెస్‌లకు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు". Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)