Jump to content

బొమ్మలగుట్ట

అక్షాంశ రేఖాంశాలు: 18°33′13″N 79°00′55″E / 18.55361°N 79.01528°E / 18.55361; 79.01528
వికీపీడియా నుండి

 

బొమ్మలగుట్ట
బొమ్మలమ్మ గుట్ట
బొమ్మలగుట్ట
బొమ్మలగుట్టపై చక్రేశ్వరీ దేవి రిలీఫ్
మతం
అనుబంధంజైనమతం
దైవంచక్రేశ్వరి
పండుగలుమహావీర జయంతి
ప్రదేశం
ప్రదేశంKarimnagar, Telangana
భౌగోళిక అంశాలు18°33′13″N 79°00′55″E / 18.55361°N 79.01528°E / 18.55361; 79.01528
వాస్తుశాస్త్రం.
శైలిద్రావిడ శైలి
సృష్టికర్తజిన వల్లభుడు
నిధులుఅరికేసరి II
స్థాపించబడిన తేదీసా.శ. 945
లక్షణాలు
దేవాలయాలు1
స్మారక చిహ్నాలు1
నిర్మాణ సామాగ్రిరాతిలో తొలిచిన

బొమ్మలగుట్ట తెలంగాణ కరీంనగర్ జిల్లా కురిక్యాల గ్రామానికి సమీపంలో ఉన్న జైన కేంద్రం. దీన్ని సిద్ధుల గుట్ట, బొమ్మలమ్మ తల్లి గుట్ట, వృషభాద్రి కొండ అని కూడా అంటారు. ఈ జైన కేంద్రం, మరొక ప్రసిద్ధ జైన కేంద్రమైన కొలనుపాక జైనమందిరం నుండి 3 కి.మీ. దూరంలో ఉంది.[1]

వ్యుత్పత్తి

[మార్చు]

బొమ్మలగుట్ట అంటే "బొమ్మల కొండ" అని అర్థం. ఈ కొండపై చెక్కిన బొమ్మలను సూచిస్తూ దీనికి పేరు పెట్టారు.[2] ఒక శాసనం ప్రకారం, ఈ ప్రదేశాన్ని మొదట సిద్ధశిల లేదా సిద్ధుల గుట్ట అని పిలిచేవారు. దీని అర్థం "జ్ఞానోదయం పొందినవారి కొండ". కొండపై చెక్కబడిన సిద్ధుల సూచనగా దీనికి పేరు పెట్టారు.[3][4][5]

చరిత్ర

[మార్చు]

వేములవాడ చాళుక్య రాజు రెండవ అరికేసరి కాలంలో బొమ్మలగుట్టను నిర్మించారు. సా.శ. 945 నాటి శాసనం ప్రకారం, ప్రముఖ కన్నడ కవి ఆదికవి పంపా సోదరుడైన జినవల్లభుడు ఇక్కడ భరతుడు, బాహుబలి, రిషభనాథుల రాతి బొమ్మలను స్థాపించాడు. 25 అడుగులు (7.6 మీ.) పొడవున్న ఇక్కడి ప్రసిద్ధ త్రిభాషా శాసనంలో ఉన్న 11 పంక్తులు కవులను పోషించినందుకు రాజ్యానికి నివాళి పలుకుతుంది. ఈ శాసనంలో తెలుగు, కన్నడం, సంస్కృత భాషలలో రచించిన పద్యాలు ఉన్నాయి.[6] ఈ శాసనం తెలుగు, కన్నడ భాషలకు అత్యంత ప్రాముఖ్యత నిస్తుంది. కన్నడ భాగంలో పంప గురించిన అమూల్యమైన సమాచారం ఉంది. తెలుగు భాగంలో అత్యంత ప్రాచీనమైన కంద పద్యం ఉంది. తెలుగుకు క్లాసిక్ లాంగ్వేజ్ హోదా కల్పించేందుకు కేంద్రానికి సమర్పించిన ముఖ్యమైన చారిత్రక ఆధారాలలో ఇది ఒకటి.[7][8][9] జినవల్లభుడు త్రిభువనతిలక బసదిని నిర్మించినట్లు కూడా ఈ శాసనంలో ఉంది.[10] కొండ శిఖరంపై జైన సన్యాసులు ధ్యానం చేసేవారు.[11]

వాస్తుకళ

[మార్చు]

ఈ ఆలయంలో ఎనిమిది చేతులతో ఉన్న చక్రేశ్వరి రాతి శిల్పానికి, రెండు బాహుబలి చిత్రాలకూ ప్రసిద్ధి చెందింది.[11][8][2] ఇక్కడ ఆమె విగ్రహం గరుడవాహనంపై ఉంది. బాస్-రిలీఫ్‌లు, శాసనాలను సంరక్షించడం కోసం, హైలైట్ చెయ్యడంకోసం ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్ర అధికారులు ఎరుపు రంగు పూత వేయించారు.[12] కొండపై మొత్తం ఎనిమిది తీర్థంకరుల విగ్రహాలను చెక్కారు. ఈ కొండ ఇప్పటికీ కొన్ని చిన్న జైన గుహలను ఎటువంటి చెక్కడాలు లేకుండా భద్రపరుస్తుంది.[3]

త్రిభువనతిలక బసది, బొమ్మలగుట్టలోని జైన రిలీఫ్‌ల సమీపంలో ఉంది. ఈ ఆలయంలో రిషభనాథ, మహావీరుల విగ్రహాలు ఉన్నాయి. కవితాగుణార్ణవ అనే సరస్సు, మదన్విలాస్ అనే తోట కూడా ఆలయ ప్రాంగణంలో భాగం.[10][4]

గ్యాలరీ

[మార్చు]

సంరక్షణ

[మార్చు]

గత 100 సంవత్సరాలుగా, జైన విగ్రహాలు, రిలీఫ్‌లు ఈ ప్రాంతంలో కనిపించాయి. వీటిని కరీంనగర్ మ్యూజియంలో భద్రపరచారు.[12][13][14]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ceremilla 2016.
  2. 2.0 2.1 Department of Heritage Telangana 2017.
  3. 3.0 3.1 Jawaharlal 2002, p. 57.
  4. 4.0 4.1 Nandi & Venkataramanayya 1966, p. 99.
  5. The Hans India 2016.
  6. Suryanarayana, p. 551.
  7. "Bommalagutta". Telangana360. January 10, 2016.
  8. 8.0 8.1 Nanisetti 2017.
  9. Tallam 2019.
  10. 10.0 10.1 Suryanarayana 1993, p. 14.
  11. 11.0 11.1 Miryala & Gade 2016, p. 105.
  12. 12.0 12.1 Balgoori 2013, pp. 167–177.
  13. Dayashankar 2020.
  14. Tallam 2020.