Jump to content

బొగ్గారపు సీతారామయ్య

వికీపీడియా నుండి
బొగ్గారపు సీతారామయ్య

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
ముందు పువ్వాడ నాగేశ్వర్‌రావు
నియోజకవర్గం సుజాతనగర్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1936
పండితాపురం గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం 08 మే 2021
హైదరాబాద్‌
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం 6 -ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు
నివాసం హైదరాబాద్‌
మతం హిందూ

బొగ్గారపు సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, మాజీ ఎమ్మెల్యే. అతను సుజాతనగర్‌ నియోజకవర్గం నుండి 1978 నుండి 1983 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బొగ్గారపు సీతారామయ్య 1936లో ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, పండితాపురం గ్రామంలో బొగ్గారపు వెంకయ్య, లక్ష్మీబాయమ్మ దంపతులకు జన్మించాడు. అతను 10వ తరగతి వరకు పండితాపురం, ఉన్నత విద్యను ఖమ్మం, ఎల్.ఎల్.బి హైదరాబాదులో పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

సీతారామయ్య ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఖమ్మం న్యాయస్థానంలో పీపీగా విధులు నిర్వహించాడు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బొగ్గారపు సీతారామయ్య 1978లో సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పువ్వాడ నాగేశ్వర్‌రావుపై గెలుపొందాడు. అతను అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. 1983లో అతనుకు టిక్కెట్‌ రాకపోవడంతో తిరిగి హైకోర్టులో న్యాయవాది వృత్తిని చేపట్టి న్యాయవాది రామ్ జెఠ్మలానీతో కలసి పనిచేశాడు.[1]

మరణం

[మార్చు]

బొగ్గారపు సీతారామయ్య 2021, మే 8న అనారోగ్యంతో హైదరాబాద్‌లో మరణించాడు.[2] బొగ్గారపు సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులతో పాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అతను భార్య బొగ్గారపు రుక్మిణమ్మ, బొగ్గారపు సీతారామయ్య మరణానంతరం తాను నివాసం ఉంటున్న మామిళ్లగూడెంలోని ఇంటిని ఒక స్వచ్ఛంద సంస్థకు చెందేలా వీలునామా రాసారు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 May 2021). "సుజాతనగర్‌ తొలి ఎమ్మెల్యే సీతారామయ్య కన్నుమూత". m.eenadu.net. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.
  2. Sakshi (8 May 2021). "మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు కన్నుమూత". Sakshi. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.