Jump to content

బొండాజాతి

వికీపీడియా నుండి

కొత్తగా అక్కడ అడుగు పెట్టిన వారికి, ఇండియాలో ఉన్నామా...లేక ఏదైనా దేశంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది.చుట్టూ ఎత్తైన కొండలు...ఆకుపచ్చటి లోయల మధ్య నుంచి వాళ్లు అలా నడచి వస్తుంటే...రాతి శిల్పాలేవో ప్రాణం పోసుకొని వస్తున్నట్టుగా ఉంటుంది.వాళ్ళే 'రిమో'లు.తూర్పు కనుమల్లోని ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో వీరు ఓ ప్రత్యేక ఆకర్షణ. వీరిది ఒక ప్రత్యేక జీవనశైళి.

రిమో జాతి గిరిజనులని ఇటు ఆంధ్రా లోనూ అటు ఒడిషా లోనూ బొండాజాతి గిరిజనులనే అంటారు .రిమో తెగ అంటే బొండా భాషలో మనుషుల తెగ అని అర్ధం. ఆంధ్రా ఒడిషా బోర్డర్...ఒడిషా లోని మల్కాన్ గిరి, కోరాఫుట్ జిల్లాల అటవీ ప్రాంతాల్లోని నలభై వరకూ గ్రామాల్లో ఈ బొండాజాతి గిరిజనులు నివశిస్తారు .ఇక్కడ మాత్రమే కనిపించే వీరి జనాభా పది...పన్నెండు వేలకి మించి ఉండరు. ఈ ప్రాంతాల్లో ఇంకా అరవై వరకూ గిరిజన తెగలున్నా...వారెవరి తోనూ ఈ రిమోలు కలవరు. గుండ్రటి మొహంతో ఎప్పుడూ మద్యం మత్తులో ఉండే రిమోలు కరకుగా...మొరటుగా కనిపిస్తారు.వీరిలో మగాళ్ళు మొలకి చిన్న గోచీ మాత్రమే కట్టుకుంటారు. ఆడాళ్ళు మొలకి కిత్తనారతో అల్లిన 'రింగా'అనే చిన్న పట్టీని, ఛాతీ కనిపించకుండా పూసలదండ్లని వేసుకుంటారు. ఆదా, మగా, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ జాతి వాళ్ళు ఎప్పుడూ ఆయుధాలు ధరించి తిరుగుతుంటారు. వారి పట్ల ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించినా విచక్షణా రహితంగా దాడి చేస్తారు. అందుకే ఈ ప్రాంత నాగరీకుల్లో వీరు నరమాంసభక్షకులనే అపోహ, దుష్ప్రచారమూ ఉంది.

పంచభూతాలని దేవతలుగా పూజించే రిమో లు...చెట్టు చేమలని పంచప్రాణాలుగా భావిస్తారు. తమ కుటీరాలు ఎవరికీ కనిపించకుండా వీరు చుట్టూ ఎత్తైన చెట్లు పెంచుకుంటారు. వ్యవసాయ నిమిత్తం తప్ప వీరు చెట్లు నరకరు.ఎవరినీ నరకనివ్వరు.వీరి ప్రాంతాల్లో చెట్లు నరకాలంటే వీరప్పన్కి అయినా వణుకు పుట్టాల్సిందే. ఇతరులు ఎవరైనా తమ గ్రామాల్లోకి వస్తే వారితో పాటూ తమ గ్రామాల్లోకి దుష్ట శక్తులు వస్తాయని వీరికి భయం.అందుకే ఎవరైనా తమ గ్రామాల వైపు వస్తే వీరు బాణాలతో వారిని తరిమి తరిమి కొడతారు.బాగా పరిచయస్థులని అప్పుడప్పుడూ అనుమతించినా...పండగ దినాల్లో వారినీ అనుమతించరు .ఆ సమయంలో వీరు బాగా తాగి ఉంటారు. మాటా మాటా పట్టింపులోస్తే...వాళ్లలో వాళ్ళే కత్తులతో, గొడ్డళ్ళతో నరుక్కుని చంపుకుంటూఉంటారు.

వీళ్లలో ఎవరైనా మరణిస్తే అక్కడ మూడు బండరాళ్లని పెడతారు .చనిపోయిన ప్రాంతంలో ఆత్మలు తిరుగుతుంటాయని వీరి నమ్మకం .రిమో లకి సారాయి అంటే మహా ఇష్టం. మామిడిపళ్ళు, జీడిమామిడిపళ్ళు, విప్పపువ్వు తోనే కాకుండా బియ్యంతో కూడా వీరు సారాయి తయారు చేసుకుంటారు.

రిమోలకి చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి .వీరిలో వరుడి కంటే వధువు వయస్సేఎక్కువగా ఉంటుంది. ఆలా చేసుకొవడమే వీరి ఆచారం. వీరు ఎ ఊరి వాళ్లు ఆ ఊరి వాళ్లని పెళ్ళి చేసుకోరు.అమ్మాయి ఇశ్హ్టప్రకారమే పేళ్లి జరగాలన్నది వీరి సంప్రదాయం.ప్రతి గ్రామ పొలీమేరల్లోనూ రేండు పక్కలా రేండు ఇళ్లని కడతారు.పదేళ్లు నిండిన ఆడపిల్లలందరినీ ఓ ఇంట్లొకి పంపుతారు. మరొ ఇంటిలొకి ఇతర గ్రామాలకి చేందిన మగపిల్లలంతా చేరతారు. అమ్మాయిలు తమకి ఎవరైతే నచ్చారొ వారికి సారా ఇచ్చి కోంత కోండ ఏలక మాంసం పెడతారు. తర్వాత ఇరుపక్శ్హాల పేద్దలూ మాట్లాడుకోని పెళ్ళి జరిపిస్తారు. వీరిలో పేళ్లయిన ఆడవాళ్లు జుట్తు కత్తిరించుకొని నార చుట్టుకుంటారు.దానిమీద పూసలదండలు అలంకరించుకొంటారు. పెళ్ళికానివాళ్లు జుట్తు కత్తిరించుకొరు. వీళ్లది మాతృస్వామ్య వ్యవస్థ. కుటుంబ నిర్వహణలో ఆడవాళ్ళదే ప్రధానపాత్ర. మగవాళ్లు పంటలు పండించి తెస్తే వాటిక్రయవిక్రయాలన్నిటినీ ఆడవాళ్లే చూసుకుంటారు.