బొంగు సూర్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొంగు సూర్యనారాయణ
జననంబొంగు సూర్యనారాయణ
పిఠాపురం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా.
మరణంటెక్కలి, శ్రీకాకుళం జిల్లా
ఇతర పేర్లుఅపరపింగళిసూరన, కవిశేఖర, మధుర కవి, నవ్యాంధ్ర ప్రబంధ కవి
వృత్తివిశ్రాంత తెలుగు పండితులు, శిల్పి, ఆయుర్వేద వైద్యులు
ప్రసిద్ధితెలుగు కవులు, సాహితీకారులు
పదవీ కాలం1937 - 2020
మతంహిందూ సనాతన ధర్మం
భార్య / భర్తవిజయలక్ష్మి
పిల్లలువేణు కుమారి, జనార్ధన రావు,రవి ప్రసాద్
తండ్రినర్సింహులు
తల్లిరామలక్ష్మి

బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం గ్రామానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు సాహితీలోకంలో తన రచనామృతంతో సాహితీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయడమేకాకుండా ఆదిత్యుడి (సూర్య దేవుని) సేవలో తరిస్తూ, మూలికా వైద్యంతో ప్రజల రోగాలను నయం చేస్తున్న బహువిద్యాకోవిదుడు. టెక్కలి ప్రధాన రహదారి పక్కన సూర్య దేవాలయం, విజయ గణపతి ఆలయం నిర్మించి దేవునిపై తమకున్న అశేష భక్తిని చాటుకున్నారు. పద్యకావ్యములకు పెద్దగా ప్రజాదరణ లేకపోవడం వలన పోతన రచనలతో సరిపోల్చదగినవిగా కొనియాడబడిన ఆయన రచనలు పాఠకులను చేరుకోలేదు.

ఒకానొకప్పుడు భోగిగా కనిపించిన శ్రీ బొంగు సూర్యనారాయణ, 40 ఏళ్ళ క్రితం ఒక రోజు రాత్రి కలలో సూర్య భగవానుడు కనిపించి తనకు చిత్తశుద్ధితో ఆలయం నిర్మించాలని కోరగా ఆనాటి నుండి ఆయనలో తెలియని తేజస్సు ప్రవేశించి కార్యనిష్ఠాపరుడై ఆలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఆయనలో వచ్చిన ఆ మార్పును చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ యెరుగుదురు.

రచనలు

[మార్చు]
  1. సూర్యరాయ సూక్తి సుమమాల
  2. సుప్రభాత సహిత సూర్యశతకం,
  3. శ్రీరామకృష్ణ యుద్ధం (ప్రబంధం),
  4. నవ్యాంధ్ర సుమతీ శతకం,
  5. రావివలస ఎండల మల్లికార్జున క్షేత్ర మహాత్మ్యం,
  6. లీలావతార గాథ,
  7. వెంకటేశ్వర శతకం,
  8. శివక్షేత్ర మహాత్మ్యం,
  9. మధుకేశ్వర క్షేత్ర మహాత్మ్యం

టెక్కలి బోర్డు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎల్ ఎల్.సి వరకు చదివిన ఇతడు దూరవిద్య ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాషాప్రవీణ కోర్సు పూర్తిచేసారు. చిన్నతనంలో తన తండ్రి నర్సింహం ప్రోత్సాహంతో తెలుగు భాషపై మక్కువ పెంచుకుని తెలుగు భాష కీర్తిని నలుదిశలా విస్తరించాలని నిరంతర కృషి చేస్తున్నారు. ఇందుకోసం టెక్కలి పాత జాతీయ రహదారిపై పౌరాణిక గ్రంథాలయం ఏర్పాటుచేసి పురాతన గ్రంథాలను అందరికీ అందుబాటులో ఉంచారు.

ప్రశంసలు, పురస్కారాలు

[మార్చు]
  1. 2006 లో విశాఖపట్నం శారదాపీఠం చేపట్టిన కార్యక్రమంలో ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి చే " మధురకవి " బిరుదు,
  2. 2006 లో శారదాపీఠం వారిచే "నవ్యాంధ్రకవి" బిరుదు,
  3. 2006 లో సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్.నరసింహారావు హైదరాబాద్ వారి "అపర పింగళి సూరన" బిరుదు,
  4. 2008 లో కడపలో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నారు.
  5. 2009 లో శ్రీ నన్నయభట్టారక పీఠం తణుకు వారి తంగిరాల వెంకటసోమయాజి పద్యకావ్య పురస్కారంతో పాటు "కవిశేఖర" బిరుదు.

టెక్కలి పాతజాతీయ రహదారి ప్రక్కన 1983 లో తన సొంత స్థలంలో సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని నిర్మించి, ప్రస్తుతం ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ భానుడి సేవలో తరిస్తున్నారు. తన తండ్రి నర్సింహం వద్ద వంశపారంపర్యంగా నేర్చుకున్న విద్యతో మహర్షి మూలికా వైద్యశాలను ఏర్పాటు చేసారు.

మూలాలు

[మార్చు]