బైరి నరేష్
బైరి నరేష్ | |
---|---|
![]() | |
జననం | 1982 ఆగస్టు 5 రాములపల్లి గ్రామం, హన్మకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
వృత్తి | హేతువాది, సైకాలజిస్టు |
భార్య / భర్త | గాండ్ల సుజాత |
పిల్లలు | ప్రశ్నోదయ్, జ్ఞానోదయ్ |
తండ్రి | ధర్మయ్య |
తల్లి | అన్నపూర్ణ |
బైరి నరేష్(జననం 1982 ఆగస్టు 15) తెలంగాణ రాష్ట్రానికి చెందిన హేతువాది[1][2], సంఘ సంస్కర్త, తెలంగాణా రాష్ట్ర సాధనలో కృషి చేసిన ఉద్యమ నాయకుడు.
తొలినాళ్లలో
[మార్చు]బైరి నరేష్ తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని రాములపల్లి గ్రామంలో జన్మించాడు. తల్లి అన్నపూర్ణమ్మ బీడీ కార్మికురాలుగా పనిచేసెది, తండ్రి ధర్మయ్య చేనేత కార్మికుడు. చిన్నతనంలోనే తన తండ్రి హేతువాద అంశాల వల్ల ప్రేరేపితం అవడం చూసిన నరేష్ నాస్తికుడిగా మారాడు[3], చిన్నతనం నుండే ఈయన భౌతిక వాదం వైపు మక్కువ చూపాడు.
బైరి నరేష్ 2009 సంవత్సరంలో గాండ్ల సుజాతని కులాంతర వివాహం చేసుకున్నాడు.
జీవితం
[మార్చు]బైరి నరేష్ ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న తర్వాత హుజురాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆ తర్వాత జమ్మికుంటలో ఓపెన్ డిగ్రీలో చేరి అదే సమయంలో కన్నూరు లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్గా కూడా పనిచేసేవాడు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2007లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందాడు.
నరేష్ 2009లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సి సైకాలజీ, 2010లో హుజురాబాద్ నుండి బి.ఎడ్, 2011లో సైకాలజీలో డిప్లమాలు పూర్తి చేసాడు. పెరియార్ పట్ల ఆకర్షితుడైన నరేష్ “మూఢనమ్మకాలు, ప్రభుత్వ పాలనపై ప్రభావం” అనే అంశంపై 2023లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందాడు.
ఒకవైపు తన చదువులను కొనసాగిస్తూనే నరేష్ తెలంగాణా ఉద్యమం కోసం కృషి చేసాడు. సింగరేణి క్షేత్రాలలో ప్రసంగాలు, సకల జనుల సమ్మె, రైలు రోకో వంటి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణా ఉద్యమాన్ని బలోపేతం చేసాడు.
మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం
[మార్చు]నాస్తికవాదం, హేతువాదం, మూఢనమ్మకాల నిర్మూలన అంశాలపై చిన్న తనం నుండి కృషి చేస్తున్న నరేష్ 2023 సంవత్సరంలో తన సతీమణి సుజాతతో కలిసి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం స్థాపించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Telugu, TV9 (2023-02-27). "Bairi Naresh: హేతువాది భైరి నరేష్‌పై మరోసారి దాడి.. పోలీసుల ప్రొటెక్షన్‌లో ఉండగానే". TV9 Telugu. Retrieved 2025-03-30.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Bureau, The Hindu (2024-01-01). "Ayyappa devotee injured as car carrying atheist Bairi Naresh hits him". The Hindu. ISSN 0971-751X. Retrieved 2025-03-30.
- ↑ "బైరి నరేష్ ప్రసంగాన్ని మెచ్చుకుంటున్న హరీష్ రావు పాత వీడియోని ఇటీవల జరిగిన సంఘటనకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు". FACTLY. 2023-01-01. Retrieved 2025-03-30.