Jump to content

బేవినహళ్ళి కరణము కృష్ణరావు

వికీపీడియా నుండి
బేవినహళ్ళి కరణము కృష్ణరావు
జననంబేవినహళ్ళి కరణము కృష్ణరావు
1894, సెప్టెంబరు 21
బేవినహళ్ళి, హిందూపురం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా
వృత్తికరణం
ప్రసిద్ధిసంస్కృత పండితుడు, కవి
మతంహిందూ
పిల్లలుఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
తండ్రినరసింగరావు
తల్లిసరసమాంబా

బేవినహళ్ళి కరణము కృష్ణరావు (జ. 1894, సెప్టెంబరు 21)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంస్కృత పండితుడు, కవి. సరసకవి శేఖర బిరుదాంకితుడు.[2]

జననం, కుటుంబం

[మార్చు]

కృష్ణరావు 1894, సెప్టెంబరు 21శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మండలంలోని బేవినహళ్ళి గ్రామంలో జన్మించాడు. తల్లి సరసమాంబా, నరసింగరావు.[2] ఇతనిది హిందూ మతానికి చెందిన బ్రాహ్మణ కులం (బడగనాడు కుటుంబం), శాంకర మతాన్ని అనుసరించేవారు.

కృష్ణరావుది సామాన్య కుటుంబం. కుటుంబ వృత్తి గ్రామ కరణీకం. కృష్ణరావు తల్లిదండ్రులకు ఎనిమిది మంది సంతానం కాగా, కృష్ణరావు చివరివాడు. ఇతనికి ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు. కృష్ణరావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3]

విద్యాభ్యాసం

[మార్చు]

కృష్ణరావు విద్యాభ్యాసం వీధిబడిలో రెండవ తరగతి వరకు మాత్రమే సాగింది. నాల్గవ తరగతిలో ఏడు నెలలు చదివినప్పటికీ, పరీక్షా సమయంలో తీవ్ర జ్వరం కారణంగా హాజరు కాలేకపోవడంతో చదువును ఆపివేయవలసి వచ్చింది. 1915 నుండి గ్రామ కరణీక పదవిని చేపట్టాడు. ఆ సమయంలోనే తెలుగు, కన్నడ గ్రంథాలను చదువుతూ, పద్యాలు రాయడంలో నైపుణ్యం సంపాదించాడు.[3]

రచనా ప్రస్థానం

[మార్చు]

కృష్ణరావు 1921లో కవిత్వం రాయడం మొదలుపెట్టి, 'లోకబాంధవ శతకము' అనే తొలి రచన చేశాడు. ఐదేళ్లపాటు నిరంతరం సాహిత్యంపై కృషి చేశాడు. హరికథలతో మొదలైన కృష్ణరావు కవిత్వం ధారాశుద్ధిని పొందింది.

ముద్రితాలు

[మార్చు]

కృష్ణరావు ముద్రిత కృతులు నాలుగు:[4]

  1. గురుదక్షిణ: ఏకలవ్యుని గురుభక్తిని తెలిపే కావ్యం.
  2. తిమ్మి మొగ్గరము: అభిమన్యుని వీర పరాక్రమాన్ని వర్ణించే కావ్యం.
  3. విహగేంద్ర విజయము: గరుత్మంతుని కథను తెలిపే కావ్యం.
  4. ఒక నవరసభరిత చతుర్థాంక నాటకము. పేరు తెలియదు.

అముద్రితాలు

[మార్చు]

కృష్ణరావు అముద్రిత కృతులు అనేకమున్నాయి. వాటిలో కొన్ని:[4]

  1. లోకబాంధవ శతకము
  2. ధర్మవిజయము (సామ్రాజ్యము)
  3. విక్రమవిజయము
  4. త్రిశతి
  5. కార్లపి శతకము
  6. సదుపదేశ శతకము
  7. వేదాంత డిండిమము
  8. సంధ్యార్థ విచారము
  9. పూతనా సంహారము (హరి కథ)
  10. యమళార్జున భంజనము
  11. కాళియ మర్దనము
  12. పారిజాతాపహరణము
  13. రుందో ఎసుంద
  14. రన్నన స్వప్న యాత్రే - గద్యము
  15. ఆదిశంకర భగవత్పాదుల చరిత్రము

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1975-07-01). రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం).
  3. 3.0 3.1 కల్లూరు అహోబలరావు (1975-07-01). రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం).
  4. 4.0 4.1 కల్లూరు అహోబలరావు (1975-07-01). రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం).

ఇతర లింకులు

[మార్చు]