బెలగాం భీమేశ్వరరావు
స్వరూపం
బెలగాం భీమేశ్వరరావు తెలుగులో బాల సాహిత్య రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు. భీమేశ్వరరావు రచించిన తాత మాట వరాల మూట కథల సంపుటికి 2019 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం లభించింది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]భీమేశ్వరరావు 1952లో విజయనగరం జిల్లా, పార్వతీపురంలో బెలగాం గంగారామ్, రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. [2] తెలుగు సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషను చేసాడు. పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసి రిటైరయ్యాడు. 2002 ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నాడు.[3]
ఆయన రచనల్లో కొన్ని
[మార్చు]- అజేయుడు[4]
- అదే సమస్య
- అన్యాయమేనా
- అన్యాయమేనా
- అవసరం
- అసలు నకిలీ
- ఆదరణ
- ఎర
- ఎర్రజీరలు
- ఒక అసమర్థుని కథ
- తాత మాట వరాల మూట - బాలల కథల సంపుటి
- పనసపళ్ళు - బాల గేయాల సంపుటి
పురస్కారాలు
[మార్చు]సాహితీ రంగంలో చేసిన కృషికి గాను భీమేశ్వరరావు అనేక పురస్కారలు పొందాడు. వాటిలో కొన్ని:
- 1992లో బొబ్బిలికి చెందిన విజ్ఞాన వివర్థిని సంస్థ బాల సాహిత్యానికి పురస్కారం.
- 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
- 2004లో ఎమ్మెస్కో - ఆంధ్రజ్యోతి సంయుక్త పురస్కారం.
- 2015లో 'శ్రీమతి మంచిపల్లి సత్యవతి' స్మారక ఉగాది బాలసాహితీ పురస్కారం.
- 2015లో తెలుగు రక్షణ వేదిక 'బాలసాహిత్య భూషణ' బిరుదు
- 2015లో డా|| ఎన్.మంగాదేవి బాలసాహిత్య పురస్కారం
- 2017లో రావూరి భరద్వాజ కళాపీఠం ద్వారా 'గంగిశెట్టి చిరంజీవి' బాలసాహిత్య పురస్కారం
- 2017లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
- 2019 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ "Sahitya Akademi announces Bal Sahitya Puraskar and Yuva Puraskar 2019". pib.gov.in. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
- ↑ "'తాతమాట' బాలసాహిత్యానికి 'వరాల మూట' | ప్రజాశక్తి::తెలుగు దినపత్రిక". www.prajasakti.com. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
- ↑ Eenadu. "బడిపిల్లలే స్ఫూర్తిదాతలు - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.