బూరె

వికీపీడియా నుండి
(బూరెలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దస్త్రం:Boorelu.jpg
రుచికరమైన బూరెలు

ఆంధ్రప్రాంతములో ప్రతి శుభకార్యములో తప్పక ఉండే ప్రసిద్దమైన తీపి వంటకం, ఇవి తక్కువ ఖర్చుతో చేయవచ్చు. మెత్తటి వరిపిండికి నీటినిచేర్చి, పలుచగామార్చుతారు. దీనిని 'తోపు పిండి అంటారు. ఉడకబెట్టిన పచ్చిసెనగ పప్పు, బెల్లముతో కలిపి చేసిన మిశ్రమాన్ని ఉండలుగా మార్చి, ఆ ఉండలను తోపుపిండిలో ముంచి, వాటిని మరిగే నూనెలో వేయించడం ద్వారా బూరెలు తయారవుతాయి. వీటిలో నెయ్యి వేసుకుని తింటారు.

పూర్ణం బూరెలు

[మార్చు]

పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు. వీటికి మధ్యలో శనగపప్పుతో చేసిన పూర్ణం కలిగువుండి మినపపప్పుతో చేసిన తొక్క వుంటుంది.

కావలసిన పదార్ధాలు

[మార్చు]
బూరెలు/దోనేపూడి గ్రామంలో తీసిన చిత్రము
బూరెలు

తయారుచేయు విధానం

[మార్చు]
  • బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి; గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి.
  • శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి సూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు.
  • ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి.
  • పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.
  • పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు.
"https://te.wikipedia.org/w/index.php?title=బూరె&oldid=4320216" నుండి వెలికితీశారు