Jump to content

బుడి ముత్యాల నాయుడు

వికీపీడియా నుండి
బుడి ముత్యాల నాయుడు

పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
(ఉప ముఖ్యమంత్రి)
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు గవిరెడ్డి రామానాయుడు
నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
తారువ గ్రామం, దేవరాపల్లి మండలం విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకు నాయుడు
జీవిత భాగస్వామి రమణమ్మ
సంతానం వెంకటేష్, రవి కుమార్

బుడి ముత్యాల నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] బూడి ముత్యాల నాయుడు 2022 ఏప్రిల్ 11న ఉప ముఖ్యమంత్రిగా నియమితుడై, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బుడి ముత్యాల నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలం, తారువ గ్రామంలో 1964లో జన్మించాడు. ఆయన దేవరాపల్లిలోని జి.జె కాలేజీ నుండి 1986లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

బుడి ముత్యాల నాయుడు 1984లో యూత్‌ కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కన్వీనర్‌గా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, తారువా గ్రామ సర్పంచ్‌గా, ములకలాపల్లి ఎంపీటీసీగా, దేవరాపల్లి మండల పరిషత్‌ ఎంపీపీగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

బుడి ముత్యాల నాయుడు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2 జూన్ 2019న ప్రభుత్వ విప్‌‌గా నియమితుడయ్యాడు.[5] బూడి ముత్యాల నాయుడు 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా (ఉప ముఖ్యమంత్రి) ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

సంవత్సరం నియోజకవర్గం అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
2014 మాడుగుల బూడి ముత్యాల నాయుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 72299 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ 67538 4761
2019 మాడుగుల బూడి ముత్యాల నాయుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 78830 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ 62438 16396
జి.సన్యాసి నాయుడు జనసేన పార్టీ 3745

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  4. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  5. Sakshi (9 June 2019). "సీఎం నమ్మకాన్ని నిలబెడతా." Archived from the original on 3 January 2022. Retrieved 4 January 2022.
  6. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.