Jump to content

బి.సత్యనారాయణ

వికీపీడియా నుండి
బొల్లు సత్యనారాయణ

బొల్లు సత్యనారాయణ తెలుగు సినిమా నిర్మాత.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం లోని జువ్విగూడెం గ్రామం.

ఆయన భార్య అన్నపూర్ణమ్మ తితిదే పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆయనకు కుమార్తె హరిత కుమారుడు తేజస్వి ఉన్నారు. సత్యనారాయణ సినీ ప్రస్థానం 1981లో 'ముద్దమందారం'తో ప్రారంభమైంది. ఆ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. 2002లో 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ'తో నిర్మాతగా మారారు. ఆపై 'బాలీవుడ్ కాలింగ్', 'మిస్సమ్మ', 'మాయాబజార్' తీశారు. అనువాద చిత్రాలు 'అభిమన్యుడు', 'గీతాంజలి' ఆయనే నిర్మాత.[1]

చిత్రాలు

[మార్చు]

ఆయన సత్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘బాలీవుడ్ కాలింగ్’, ‘ధనలక్ష్మి ఐ లవ్ యూ’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలను నిర్మించారు.ఆయన నిర్మించిన ‘మిస్సమ్మ’ (2003) చిత్రంలో భూమిక టైటిల్ రోల్ పోషించారు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘మిస్సమ్మ’ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడంతో పాటు రివార్డులూ పొందింది. అలాగే ‘మాయాబజార్’ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్ర పోషించారు.[2][3]

మరణం

[మార్చు]

ఆయన ఆగష్టు 28 2015 శనివారం మధ్యాహ్నం తిరుపతిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]
  1. మిస్సమ్మ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత
  2. బి.సత్యనారాయణ కన్నుమూత[permanent dead link]
  3. "Senior producer B Satyanarayana is no more". Archived from the original on 2016-04-04. Retrieved 2015-08-30.

ఇతర లింకులు

[మార్చు]