బిళ్ళ సురగం గుహలు
స్వరూపం
బిళ్ళ సురగం గుహలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని నంద్యాల జిల్లాలో బేతంచర్ల పట్టణానికి 5 కి.మీ దూరంలో ఉన్న గుహల సముదాయం. వీటిని బిళ్ళ స్వర్గం గుహలనీ, బిల్వ స్వర్గం గుహలనీ కూడా వ్యవరిస్తారు. తెలుగులోని 'బిలం', సంస్కృతంలోని 'సురంగం' పదాల కలయికతో ఈ గుహలకు ఈ పేరు వచ్చింది.[1] 19వ శతాబ్దం మధ్యలో వీటిలో పురావస్తు, పేలియాంటాలజీ పరిశోధనలు మొదలయ్యాయి. ఈ పరిశోధనల్లో పాతరాతియుగం నాటి దక్షిణ భారత పరిస్థితులు, మానవ జీవన స్థితిగతుల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి.
- ↑ Haslam, Michael, et al. "In Foote's steps: the history, significance and recent archaeological investigation of the Billa Surgam Caves in southern India." South Asian Studies 26.1 (2010): 1-19.