బిళ్ళ గన్నేరు
బిళ్ళగన్నేరు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | కథ. రొజేయుస్
|
Binomial name | |
కథరాంథుస్ రొజేయుస్ | |
Synonyms | |
వింకా రోజియా |
బిళ్ళగన్నేరు (ఆంగ్లం: The Madagascar Periwinkle; The Rose Periwinkle) అనేది భారతదేశంలో సర్వసాధారణంగా కనబడే ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు.
చరిత్ర
[మార్చు]బిళ్ళ గన్నేరు (కాథరాంథస్ రోజస్) కెన్యా, ఉగాండా, తాంజనియా (హెండర్సన్ 2002) దేశాలలో సహజసిద్ధమైనది. తాంజనియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం కోసం సాగుబడి చేస్తారు. ఇది పొడి నెలలో, బహిరంగ ప్రదేశాలలో, రహదారుల ప్రక్కలా విరివిగా పెరుగుతుంది. ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో, ఇసుక నేలలతో ఉన్నచోట్లలో బాగా కనబడతాయి. ఇది నిజానికి తూర్పు-ఆఫ్రికాకు చెందిన ఒక సాధారణ తోట మొక్క. బిళ్ళగన్నేరు దీర్ఘకాలికమైన పొదలు కలిగి ఉండి, 30-100 సెం.మీ ఎత్తు దాకా పెరుగుతుంది; అందమైన పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు 2.0-4.7 సెం.మీ పొడవులో చిన్నచిన్న నల్లని విత్తనాలను కలిగియుంటాయి. బిళ్ళగన్నేరులో తెలుపు, గులాబీ, వంకాయ వంటి రంగుల పూలతో ఉన్న రకాలు కూడా ఉంటాయి.[1]
భారతదేశంలో బిళ్ళగన్నేరు
[మార్చు]మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో దీనిని పిలుస్తారు: [2]
- ఆంగ్లము—మాడగాస్కర్ పెరీవింకిల్; గ్రేవ్యార్డ్ ప్ల్యాంట్; కేప్ పెరీవింకిల్; రోజీ పెరీవింకిల్
- అస్సాం—నయన్తారా, పిరాలి కున్వోరి
- బెంగాలీ—నొయొంతారా
- హిందీ—సదాబహార్, సదాఫులీ, సదాసుహాగీ
- కొంకణి—సదాపుష్ప
- కన్నడము—సదాపుష్ప
- మలయాళం—నిత్యకల్యాణి
- మరాఠీ—సదాఫులీ
- తమిళము—నిత్తియ కల్యాణి
లక్షణాలు
[మార్చు]- బహువార్షిక చిన్న పొద.
- దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు.
- పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు.
- జంట ఏకవిదారక ఫలాలు, నల్లని విత్తనాలు.
ఉపయోగాలు
[మార్చు]బిళ్ళగన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్, విన్‌క్రిస్టీన్. ఇవి కాన్సర్ వైద్యంలో వాడతారు. బిళ్ళగన్నేరు ఆకులను, పూలను మధుమేహ నివారణకు, అధిక రక్తపోటును నియంత్రిచుటకే గాక, పలు చర్మవ్యాధుల చికిత్సలో కూడా వినియోగిస్తారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Factsheet - Catharanthus roseus (Madagascar Periwinkle)". keys.lucidcentral.org. Retrieved 2020-10-22.
- ↑ "Catharanthus roseus (L.) G. Don". India Biodiversity Portal. Retrieved 2020-10-22.
- ↑ Moudi, Maryam; Go, Rusea; Yien, Christina Yong Seok; Nazre, Mohd. (Nov 2013). "Vinca Alkaloids". International Journal of Preventive Medicine. 4 (11): 1231–1235. ISSN 2008-7802. PMC 3883245. PMID 24404355.