Jump to content

బియ్యపు సాయిక్రిష్ణ

వికీపీడియా నుండి
బియ్యపు సాయిక్రిష్ణ
జననంబియ్యపు సాయిక్రిష్ణ
ఆగస్టు 7
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిసినిమా కథ, సంభాషణల రచయిత.

సాయికృష్ణ బియ్యపు తెలుగు సినిమా కథ, మాటల రచయిత. 2002లో వచ్చిన మౌనమేలనోయి సినిమాకు మొదటిసారిగా మాటల రచయితగా పనిచేశాడు.

జీవిత విషయాలు

[మార్చు]

సాయికృష్ణ ఆగస్టు 7న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించాడు. ఏలూరులోని పాఠశాల విద్యను పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదివాడు. ఇతనికి కంటేటి రజినిలో వివాహం జరిగింది.

సినిమారంగం

[మార్చు]

2002, ఏప్రిల్ 26న మనీషా పతాకంపై శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో సచిన్, సంపద హిరో, హీరోయిన్లుగా విడుదలైన మౌనమేలనోయి సినిమాకు మొదటిసారిగా మాటల రచయితగా పనిచేశాడు. తర్వాత చంద్రమహేష్ దర్శకత్వంలో జోరుగా హుషారుగా, దశరధ్ దర్శకత్వంలో సంబరం సినిమాకు రాశాడు.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sai Krishna Biyyapu Movies, Sai Krishna Biyyapu Filmography, All Movies List, Latest Movies". MovieGQ. Retrieved 2020-09-13.
  2. "Nenu Local (2017)". Indiancine.ma. Retrieved 2020-09-13.

బాహ్య లంకెలు

[మార్చు]